Just In
Don't Miss!
- News
ఇండోనేసియా భూకంపం: 42కు పెరిగిన మృతులు -వందల ఇళ్లు ధ్వంసం -చీకట్లో సులవేసి దీవి
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి
- Sports
పతంగి ఎగురవేసిన ఇర్ఫాన్ పఠాన్.. కైట్ కోసం పిల్లల పాట్లు వీడియో
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పీడకల: మాజీ ప్రియుడి గురించి హీరోయిన్
హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింతా, వ్యాపార వేత్త నెస్ వాడియాతో గత కొన్నేల్లుగా ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఐపీఎల్ ప్రాంచైజీ ఓనర్లు కూడా అయ్యారు. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కేసులు పెట్టుకోవడం కూడా జరిగింది.

ఇటీవల మీడియా ఇంటరాక్షన్లో నెస్ వాడియా గురించి స్పందిస్తూ...నా జీవితంలో అతడో పీడకల, మా మధ్య జరిగినంతా దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. తమ మధ్య విబేధాలు ఉన్నప్పటికీ ఐపీఎల్ ఫ్రాంచైజీ నుండి దూరం కావాలనుకోవడం లేదని ప్రీతి జింతా చెప్పుకొచ్చింది.
కాగా...తన పాత మిత్రుడు యువరాజ్‌తో కొత్త ఎఫైర్ మొదలుపెట్టిందని టాక్ మొదలైంది. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తరువాత అమ్మాయిలకు కొంత దూరంగా ఉంటూ వస్తున్న యువీ.. ప్రీతి జింటాతో సహజీవనం చేస్తున్నాడని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. ప్రీతి కష్టాల్లో ఉందని తెలుసుకున్న యువీ.. ఆమెకు అండగా నిలవడంతో ప్రీతి కూడా అతడిలో కొత్త తోడును చూసుకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.