»   » లైంగిక వేధింపులు: బాయ్ ఫ్రెండుపై ప్రీతిజింతా ఫిర్యాదు

లైంగిక వేధింపులు: బాయ్ ఫ్రెండుపై ప్రీతిజింతా ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటి, కింగ్స్ లెవన్ పంజాబ్ ఐపీఎల్ టీం జట్టు ఓనర్ ప్రీతి జింతా తన మాజీ బాయ్ ఫ్రెండ్, బిజినెస్ మేన్ నెస్ వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సౌత్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో నెస్ వాడియా తనను లైంగికంగా వేధించాడని, బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది.

39 ఏళ్ల ప్రీతీ జింతా ఈ విషయమై గురువారం రాత్రి మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేసింది. మే 30వ తేదీన నెస్ వాడియా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ప్రీతి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వర్గాలు వెల్లడించాయి.

మే 30వ తేదీన స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గర్వారే పెవిలియన్ వద్ద ఉండి వీక్షిస్తున్న ప్రీతి జింతాను అతను వేధించినట్లు, అనేక మంది ముందు అసభ్య పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది.

Preity Zinta files molestation complaint against Ness Wadia

ప్రీతి జింతా లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు నెస్ వాడియాపై ఐపిసి సెక్షన్స్ 354(స్త్రీలపై దౌర్జన్యం చేయడం), 504(అవమానించడం, శాంతికి భంగం కలిగించడం), 506(తీవ్ర నేరాలకు పాల్పడటం), 509(మహిళలను దూషించడం, కించపరిచే చర్యలకు పాల్పడటం)ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ముగియడం వల్లనే నెస్ వాడియా ఇలాంటి చర్యలకు పాల్పడట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొనబడి ఉంది.

అయితే నెస్ వాడియా మాత్రం ప్రీతి జింతా ఆరోపణలను ఖండించారు. ఆమె ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవిన పేర్కొన్నారు. ఆమె ఆరోపణలు చేస్తున్నట్లు నేను అలా చేసే అవకాశం కూడా లేదు, ఎందుకంటే ప్రీతి జింతా చుట్టూ ఎప్పుడూ బౌన్సర్లు ఉంటారు అని నెస్ వాడియా పేర్కొన్నారు.

English summary
Bollywood actress Preity Zinta, who is also co-owner of Kings XI Punjab cricket team, has filed a police complaint against her former boyfriend and businessman Ness Wadia, alleging that he molested, abused and threatened her inside Wankhede stadium in south Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more