»   » ఎన్నిఎఫైర్లో... ఎట్టకేలకు ప్రీతి జింతా పెళ్లి సెట్టయింది!

ఎన్నిఎఫైర్లో... ఎట్టకేలకు ప్రీతి జింతా పెళ్లి సెట్టయింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అమ్మడి వయసు 40 ఏళ్లు దాటింది. అయినా ఇప్పటికీ పెళ్లి పెటాకులు లేకుండా సోలో లైఫ్ లాంగిచేస్తోంది. పెళ్లి చేసుకోకుంటే ఏంటి....అమ్మడు చాలా మందితో ఎఫైర్లు నడిపింది అని అనే వారూ లేకపోలేదు.

అయితే ఎట్టకేలకు ప్రీతి జింతా పెళ్లికి సిద్దమైనట్లు తెలుస్తోంది. మరో వారంలో ఆమె ఇల్లాలు కాబోతోందట. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ ఎనలిస్ట్ జీన్ గుడ్‌ఇనో, ప్రీతీ జింటా కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారని, ఈ జంట ఈ నెల 12న వివాహం ఒక్కటి కాబోతున్నారని బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ప్రీతి జింతా వివాహ వేడుక ఏంజెల్స్‌ జరుగుతుందని, వివాహ వేడుకలు 12 నుంచి 16వరకు ఐదు రోజులపాటు వివాహ వేడుకలు జరుగనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే గతంలోనూ ప్రీతి జింతా పెళ్లి గురించి ఇలానే వార్తలు వచ్చాయి. అప్పడు వాటిని ఆమె ఖండించింది. మరి ఇపుడు ఈ వార్తలు నిజమా? లేక ఖండిస్తుందా? అనేది తేలాల్సి ఉంది.

ప్రీతి జింతా వివాదాస్పద లవ్ లైఫ్‌కు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

నెస్ వాడియా

నెస్ వాడియా

నెస్ వాడియా, ప్రీతి జింతా మధ్య ఉన్న సంబంధం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఇద్దరూ కలిసి గతంలో ఐపీఎల్ పంజాబ్ టీంకు ఓనర్లుగా ఉన్నారు. కొంత కాలం తర్వాత విడిపోయారు.

యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్

ఐపీఎల్ పంజాబ్ టీంలో గతంలో ఆడిన యవరాజ్ సింగ్‌, ప్రీతి జింతా వార్తల్లోకి ఎక్కారు. వీరు చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుండటంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. యువరాజ్ కారణంగానే నెస్ వాడియా ప్రీతికి దూరమయ్యాడనే వార్తలు కూడా వినిపించాయి. అయితే యువరాజ్‌తో అమ్మడు ఎక్కువ కాలం కలిసి ఉండ లేక పోయింది.

శేఖర్ కపూర్

శేఖర్ కపూర్

బాలీవుడ్ నటుడు శేఖర్ కపూర్ మాజీ భార్య సుచిత్ర కృష్ణ మూర్తి సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తతో విడిపోవడానికి కారణం ప్రీతీ జింతాతో ఎఫైర్ కారణమని ఆమె ఆరోపించింది. అయితే ఈ వార్తలను ప్రీతి జింతా కొట్టి పారేసింది.

మార్క్ రాబిన్సన్

మార్క్ రాబిన్సన్

చాలా ఏళ్ల క్రితం 2000 సంవత్సరంలో ప్రీతి జింతా మోడల్ మార్క్ రాబిన్సన్‌తో సహజీవనం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కొంత కాలం తర్వాత ఇద్దరూ విడిపోయారు.

లార్స్ జెల్ద్సేన్

లార్స్ జెల్ద్సేన్

ప్రీతి జింతా, లార్స్ జెల్ద్సేన్‌తో 2004లో సన్నిహితంగా మెలిగింది. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందో? లేదో? తెలియదు కానీ ఇద్దరూ సన్నిహితంగా ఉండే ఫోటోలు అప్పట్లో చర్చనీయాంశం అయింది.

English summary
Talking about Preity Zinta's marriage, a source told Spotboye.com that Preity Zinta told him, "It's a five day affair in the US from February 12-16. It would be great if you can join me in my moment of happiness.''
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu