సైఫ్‌ని నిజంగానే చంపేసేదాన్ని.. ప్రీతి జింతా!
సైఫ్ అలీఖాన్, సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింతా నటించిన సలాం నమస్తే చిత్రం నిన్నటితో 13 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 2005 లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అప్పట్లోనే సహజీవనం అంశంతో ఈ చిత్రం తెరకెక్కడం విశేషం. సైఫ్, ప్రీతీ జింతా అద్భుత నటన కనబరిచారు. 13 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఈ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ ప్రీతీ జింతా ఆసక్తికరంగా స్పందించింది.

ఈ చిత్రం షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్ చేశా. నటించే సమయంలో లీనమైపోయేదాన్ని. సైఫ్ తో గొడవ పడే సన్నివేశాల్లో నేను అతడిని నిజంగా చంపేస్తానేమో అని సెట్ లో ఉన్నవారంతా భయపడేవారు. సందర్భంగా తాను సైఫ్ ని మిస్ అవుతున్నా అంటూ ప్రీతీ జింతా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం ప్రీతి జింతా సినిమాలని పక్కన పెట్టి ఐపీఎల్ ప్రాంచైజీ పంజాబ్ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











