For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీక్రెట్ గా దాచిన స్టార్ హీరోయిన్ పెళ్లి ఫొటోలు లీక్..ఇవిగో అవి

  By Srikanya
  |

  ముంబై: బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా ఆ మధ్యన తన బాయ్ ఫ్రెండ్‌నే వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెళ్లి ఫొటోలు మాత్రం బయిటకు రాలేదు. అయితే ప్రీతి జింతా అభిమానుల అదృష్టం బాగున్నట్లుంది. ఆమె ఫొటోలు కాస్త లేటుగా అయినా బయిటకు వచ్చాయి. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ప్రెవేట్ సెర్మనీ కు చెందిన ఫొటోలు మీరు ఈ క్రింద చూడవచ్చు.

  ప్రీతి జింతా వివాహం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో తన బాయ్ ఫ్రెండ్ జీని గుడెనఫ్‌తో జరిగింది. ఫిబ్రవరి 29న ప్రీతి జింతా, జీని గుడెనఫ్‌లు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. దీనికి ప్రీతికి సన్నిహితులైన సుజానేఖాన్, సురిలీ గోయెల్‌లు హాజరు అయినట్టు బీటౌన్ టాక్.

  ఏప్రిల్ నెలలో ప్రీతి ఇండియాకు వచ్చింది. అదే నెలలో బాలీవుడ్ సెలబ్రిటీస్, ఫ్రెండ్స్ మధ్య తన రిసెప్షన్‌ను ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ దిల్ సే హీరోయిన్ ప్రముఖ వ్యాపారవేత్త నెస్ వాడియాను వివాహం చేసుకోనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ను కొనుగోలు చేశారు. అనంతరం వారిద్దరి మధ్య వివాదం ఏర్పడటం, పరస్పరం కేసులు పెట్టుకునే దాకా వ్యవహారం వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు.

  స్లైడ్ షోలో ప్రీతి జింతా మ్యారేజ్ ఫొటోలు

  రాయల్ గా

  రాయల్ గా

  ఈ ఫొటో చూస్తూంటే ముచ్చటగా అనకుండా రాయల్ గా ఉన్న జంట అనాలి.

  మామూలోడు కాదు

  మామూలోడు కాదు

  ఇంతకీ ప్రీతి భర్త జీని గుడెనఫ్‌ బ్యాక్ గ్రౌండ్ తెలుసా. ఆయన అమెరెకా బేసెడ్ హైడ్రాలిక్ పవర్ కంపెనీ కు ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్

  ఇద్దరూ

  ఇద్దరూ

  స్పెయిన్ లా స్కూల్లో ఎమ్ బి ఎ చేసిన జీని గుడెనఫ్ ..ప్రీతి తో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు.

  గ్రేట్ ఎక్సపీరియన్స్

  గ్రేట్ ఎక్సపీరియన్స్

  తన వైవాహిక జీవితం చాలా చాలా అద్బుతంగా ఉందని, అది ఓ గ్రేట్ ఎక్సపీరియెన్స్ అని ప్రీతి జింతా చెప్పింది

  అందుకే సీక్రెట్

  అందుకే సీక్రెట్

  వివాహాన్ని సీక్రెట్ గా ఉంచడానికి కారణం ప్రీతి చెప్తూ...జీవితంలో ప్రతీ విషయం పబ్లిక్ అవటం నాకు ఇష్టం లేదు. ఇది నా జీవితం.నేను నా విషయాలు చెప్పాలో వద్దా అనేది నేను నిర్ణయించుకుంటాను. అలాగే అన్ని విషయాలు అందరికీ వెల్లడి చెయ్యను అంది.

  సింపుల్ గా

  సింపుల్ గా

  తన వివాహం ఎందుకంత సింపుల్ గా చేసుకుందో చెప్తూ..నేను ప్రెవేట్ వ్యక్తిని మొదటినుంచి, నా గురించి ఎందుకంతలా నా ఫర్మిషన్ లేకుండా రాసేస్తారో నాకు ఇప్పటికి అర్దం కాదు అంది

  ఇండియా రాగానే

  ఇండియా రాగానే

  తాను యుఎస్ నుంచి ఇండియాకు రాగానే మొదట ఛాయ్ తాగానని, తర్వాత దై పూరి తిన్నానని తనకు ఇండియా అంటే అత్యంత ఇష్టమని చెప్పింది

  మిస్సయ్యా

  మిస్సయ్యా

  నిజం చెప్పాలంటే నేను ఇండియాను మిస్సయ్యా...ఎవరైనా సరే మాతృదేశానికి దూరంగా ఉంటే ఇలాంటి ఫీలింగే కలుగుతుందేమో

  తాజ్ మహల్ కు వెళ్లినప్పుడు

  తాజ్ మహల్ కు వెళ్లినప్పుడు

  ప్రీతి, తన భర్తతో కలిసి తాజ్ మహల్ కు వెళ్లినప్పటి ఫొటో ఇది.

  ఐపిఎల్ మ్యాచ్ లో

  ఐపిఎల్ మ్యాచ్ లో

  పెళ్లికు ముందు ఐపిఎల్ మ్యాచ్ లో ఇద్దరూ తొలిసారిగా పబ్లిక్ అయ్యారు.

  English summary
  An amazing news for all the Preity Zinta fans out there! We got our hands on the wedding pictures of the lovely actress Priety Zinta, who got married to her longtime boyfriend Gene Goodenough in a private ceremony in Los Angeles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X