»   » 'ప్రేమ ఇష్క్ కాదల్' విడుదల తేదీ ఖరారు

'ప్రేమ ఇష్క్ కాదల్' విడుదల తేదీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హర్షవర్దన్ రాణే, వితిక శేరు, విష్ణువర్ధన్, రీతు వర్మ, హరీష్, శ్రీముఖి కీలక పాత్రధారులుగా డి.సురేష్ బాబు సమర్పిస్తున్న సినిమా 'ప్రేమ ఇష్క్ కాదల్'. ఈ చిత్రం డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. ఇది ఓ కొత్త తరహా ప్రేమ కథ అని, ఈ తరానికి చెందిన యూత్ కథ అని, నోవల్ గా నడిచే నేరేషన్ తో ఈ చిత్రం నడుస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు అందరి మన్ననలూ పొందుతున్నాయి. షిర్డి సాయి కంబైన్స్ నిర్మిస్తోంది. బెక్కం వేణుగోపాల్ నిర్మాత.పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. శ్రవణ్ సంగీతాన్ని సమకూర్చారు.

నిర్మాత మాట్లాడుతూ "ఇప్పటివరకు నేను ఆరు సినిమాలు చేశాను. ప్రతి సినిమాలోనూ ఏదో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్లాను. ఈ సినిమాను చేయడానికి ముఖ్య కారణం దర్శకుడు. సినిమా మీద ప్యాషన్‌తో అమెరికా నుంచి వచ్చాడు. కెమెరామేన్ కార్తిక్ కూడా చాలా కష్టపడి ఈ సినిమా చేశాడు. సురేష్‌బాబుగారు మంచి సపోర్ట్ ఇచ్చారు. మధురశ్రీధర్ కూడా రషెస్ చూసి సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది'' అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ "సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో ఇక్కడికి వచ్చాను. కృష్ణచైతన్య మంచి సపోర్ట్ ఇచ్చారు. శ్రవణ్ సంగీతం మా సినిమాకు ప్రాణం పోసింది. దాదాపు రెండేళ్ల పాటు నాతో పాటు కష్టపడిన అందరికీ ధన్యవాదాలు'' అని తెలిపారు. స్వరకర్త శ్రవణ్ మాట్లాడుతూ "నేను దర్శకుడి షాట్ ఫిల్మ్స్ చూశాను. చక్కగా తెరకెక్కించారు'' అని చెప్పారు.

English summary
Prema Ishq Kadhal is all set to release on the 6th of December. It’s a new age love story, with a novel style of narration. The music album of the film has already generated good interest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu