హిందీ, తమిళంలో ‘ప్రేమకథా చిత్రమ్’ రీమేక్
ఈ చిత్రం హిందీ, తమిళం రైట్స్ మంచి రేటుకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. హిందీ రీమేక్ రైట్స్ ఆది శేషగిరిరావు, తమిళ రీమేక్ రైట్స్ తమిళ నిర్మాత కాశీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈచిత్రం కేవలం 2 కోట్ల రూపాయలతో నిర్మించారు. కానీ రెండు వారల్లోనే ఈచిత్రం రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసింది.
కాగా...త్వరలో 'ప్రేమకథా చిత్రమ్' సీక్వెల్ కూడా రాబోతోంది. 'పెళ్లి కథా చిత్రమ్' పేరుతో ఈ సీక్వెల్ రాబోతున్నట్లు ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుదర్శన్ రెడ్డి తెలిపారు. మరో వైపు ఈచిత్రంతో సుధీర్ బాబుకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ఊపుతో ఆయన వరుస సినిమాలు సైన్ చేసాడు.
త్వరలో సుధీర్ బాబు 'మాయదారి మల్లిగాడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'మాయదారి మల్లిగాడు' చిత్రం ద్వారా హనుమాన్ అనే కొత్త దర్శకుడు వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. రేవన్ కుమార్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 26న ఈ చిత్రం లాంభనంగా ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.


Click it and Unblock the Notifications












