»   » 23కేంద్రాల్లో జూన్ 6 ‘ప్రేమ కావాలి’ శతదినోత్సవం..!

23కేంద్రాల్లో జూన్ 6 ‘ప్రేమ కావాలి’ శతదినోత్సవం..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్ఫణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై డైలాంగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది హీరోగా ప్రముఖ దర్శకుడు కె విజయభాస్కర్ దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ కె అచ్చిరెడ్డి నిర్మించిన 'ప్రేమాకావాలి" చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించి అఖండ ప్రజాదరణతో 23కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోబోతోంది.

ఈ సందర్బంగా నిర్మాత కె అచ్చిరెడ్డి మాట్లాడుతూ 'ప్రేమకావాలి" చిత్రాన్ని ప్రేక్షకులు అపూర్వంగా ఆదరించి దిగ్విజచంగా 23కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకునే స్థాయికి తీసుకెళ్ళారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్ గారు ఆదిని హీరోగా పరిచయం చెయ్యాలన్న ఉద్దేశ్యంతో 'ప్రేమకావాలి" ప్రాజెక్ట్ ని ప్లాన్ చేశారు. వెంకట్ గారికి ఆది మీద వున్న నమ్మకాన్ని ప్రేక్షకలు 'ప్రేమకావాలి" చిత్రంతో నిరూపించారు. ఎన్నో భారీ చిత్రాల పోటీ, క్రికెట్ ధాటిని తట్టుకొని 23కేంద్రాల్లో డెఫ్ ఫీట్ లేకుండా రియల్ గా 100రోజులు ప్రదర్శింపబడి సూపర్ హిట్ చిత్రంగా 'ప్రేమకావాలి" నిలబడింది. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన 'ప్రేమకావాలి"శతదినోత్సవ వేడుకల్ని సినీ ప్రముఖుల సమక్షంలో జూన్ 6 సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరపడానికి ప్లాన్ చేసాం. మాక్స్ ఇండియా బేనర్ లో నిర్మించిన ఫస్ట్ ఫిల్మింని హండ్రెడ్ డేస్ ఫిలింగా ఆదరించిన ప్రేక్షకులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు. ప్రేమకావాలి 100రోజుల కేంద్రాలు:
1. వైజాగ్: జ్యోతి ఎ/సి డిటిఎస్     2. విజయనగరం: సప్తగిరిఎ/సి డిటిఎస్
3. శ్రీకాకుళం: రామ్ లక్ష్మణ్ ఎ/సి డిటిఎస్    4 అనకాపల్లి: రామచంద్ర ఎ/సి డిటిఎస్
5. రాజమండ్రి: శ్యామల టాకీస్     6. కాకినాడ: దేవికాంప్లెక్స్
7. అమలాపురం: గంగరాజ    8. ఏలూరు: బాలాజీ ఎ/సి డిటిఎస్
9. విజయవాడ: శకుంతలఎ/సి డిటిఎస్   10. గుంటూరు: నాజ్ అప్సర
11. తిరుపతి: కృష్ణతేజ గ్రూప్    12. కడప: జయశ్రీ ఎ/సి డిటిఎస్
13 మదనపల్లి: సునీల్ ఎ/సి డిటిఎస్    14. కర్నూలు: ఆనంద్ కాంప్లెక్స్
15. నంద్యాల: మినిప్రతాప్ ఎ/సి డిటిఎస్    16. ఆదోని: రాజ్ ఎ/సి డిటిఎస్
17. అనంతపురం: నీలిమా థియేటర్    18. హైదరాబాద్: శ్రీమయూరి
19. ఖమ్మం: సుందర్ మాక్స్    20. నిజామాబాద్: అశోక
21. మహబూబ్ నగర్: వెంకటాద్రి    22. తెనాలి: శ్రీప్రియఎ/సి డిటిఎస్
23. నెల్లూరు : నర్తకి, న్యూటాకీస్

English summary
Dialogue King Sai Kumar's son Aadi and Isha Chawla starrer 'Prema Kavali' completed 100 days in 23 centers across the state. K Vijayabhaskar directed this film and K Achi Reddy from R R Movie makers and Max India productions banner produced it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu