»   » ‘ప్రేమమ్’ పబ్లిక్ టాక్, ఆడియన్స్ రివ్యూ...

‘ప్రేమమ్’ పబ్లిక్ టాక్, ఆడియన్స్ రివ్యూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగ చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్, మడొన్నాసెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో, చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో తెరకెక్కిన 'ప్రేమమ్' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా రిలీజైంది.

మలయాళ హిట్ మూవీకి రీమేక్ కావడం..... తెలుగులో ఇప్పటికే రిలీజైన ట్రైలర్, ఆడియో జనాలకు ఇప్పటికే బాగా నచ్చడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు మార్నింగ్ షో నుండే ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు సినిమా గురించి నెగెటివ్ గా కూడా తమ అభిప్రాయాలు వెల్లడించారు.


ట్విట్టర్లో కొందరు ఈ సినిమా గురించి తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఓ లుక్కేయండి.


ప్రేమమ్ ఫస్టాఫ్ సూపర్

ప్రేమమ్ ఫస్టాఫ్ సూపర్ గా ఉంది, కామెడీ, డైలాగులు బావున్నాయి. నేటివిటీని బాగా అడాప్ట్ చేసుకున్నారు


సెకండాఫ్ వండర్ ఫుల్

ప్రేమమ్ సెకండాఫ్ వండర్ ఫుల్ గా ఉంది. బ్లాక్ బస్టర్ మూవీ ఇది. నాగ చైతన్య కెరీర్లో మరో భారీ హిట్ అంటూ ట్వీట్.


చాచిపెట్టి కొట్టారు

ప్రేమమ్ రీమేక్ చేస్తున్నారు అనగానే ట్రోల్ చేసిన వారికి చాచిపెట్టి కొట్టారు. సినిమా చాలా బావుంది అంటూ ట్వీట్.


నాగ చైతన్య అదరగొట్టారు

నేను మలయాళం ప్రేమమ్ కూడా చూసాను. తెలుగులో కూడా చాలా బాగా వచ్చింది. నాగ చైతన్య మూడు షేడ్స్ లో అదరగొట్టాడు అంటూ అంటూ ఓ అభిమాని ట్వీట్.


బ్లాక్ బస్టర్

ప్రేమమ్ గురించి ఓన్లీ వన్ వర్డ్. 2016 బ్లాక్ బస్టర్ అంతే. నాగ చైతన్యకు మంచి భవిష్యత్ ఉంది.


పర్ ఫెక్ట్ రీమేక్

రీమేక్ పర్ ఫెక్ట్ గా చేసారు. అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.


యావరేజ్

ఫస్టాఫ్ యావరేజ్ గా ఉంది. నాగ చైతన్య తప్ప సినిమాలో అంతా బాగానే ఉంది. ఈ సినిమా హిట్టవుతుందనే నమ్మకం లేదు అంటూ ట్వీట్.


శృతి హాసన్ పార్ట్ సంతృప్తి

ప్రేమమ్ మూవీ ఓకే. కానీ శృతి హాసన్ పార్ట్ సంతృప్తి కరంగా లేదు. మిగతా విషయంలో ఎలాంటి కంప్లయింట్స్ లేవు.English summary
Director Chandoo Mondeti's Telugu movie Premam starring Naga Chaitanya, Shruti Haasan, Madonna Sebastian and Anupama Parameswaran has garnered positive reviews from the audience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X