»   » చైతూ నిర్ణయం సరైందేనా?? మరింత ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందేమో..

చైతూ నిర్ణయం సరైందేనా?? మరింత ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందేమో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగ చైతన్య కి చాలా రోజులుగా టైం కలిసి రావటం లేదు. దోచెయ్ డిజాస్టర్ తర్వాత ఖచ్చితంగా హిట్ కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు నాగ చైతన్య ఆశలన్నీ "సాహసం శ్వాసగా సాగిపో" "ప్రేమం" ల మీదే ఉన్నాయి. ఈ రెండిటిలో ఏఒక్కటైనా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంటే తప్ప చైతూ సేఫ్ జోన్ లోకి వచ్చినట్టు కాదు.

అయితే ఇప్పుడు రెండు సినిమాలూ గందర గోళం లో పడ్డాయి. ఒక పక్క రజినీకాంత్, రెండో పక్క మేన మామ వెంకటేష్, జూనియ ఎన్టీఆర్ లు తమ తమ సినిమాలతో. చైతూని చాలెంజ్ చేస్తున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో తన కెరీర్కే కీలకం అయిన సినిమాల పరిస్థితేమిటో తేల్చుకోలేకపోతున్నాడు చైతూ...


ఒకవేళ రిస్క్ తీసుకొని "సాహసం.." ని రిలీజ్ చేస్తే ఏమాత్రం సినిమా ఫలితాలు అటూ ఇటూ అయినా దాని వెంటనే వచ్చే "ప్రేమం మీద ఖచ్చితంగా ఆ ప్రభావం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం నిర్ణయించుకోవాలో తెలియక ఆందోళన పడుతున్నాడు చైతూ. ఎందుకంటే ఇప్పటికే వచ్చి పడుతున్న "యువ హీరోలు" గట్టి పోటీ నే ఇస్తున్నారు....


'ప్రేమమ్‌' వేసవిలోనే విడుదల కావాల్సి ఉన్నా...షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడక తప్పలేదు.ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'జనతా గ్యారేజ్‌' విడుదల ఆగస్టు 12న అని ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ముందు ఆగస్టు 12 నే అనుకున్నా యంగ్ టైగర్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ ఉండటం తో రిస్క్ ఎందుకు లెమ్మనుకున్నారట.


ఇప్పుడు వరుసగా 'కబాలి', 'బాబు బంగారం', 'జనతా గ్యారేజ్' వంటి పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉండడంతో తన 'ప్రేమమ్' చిత్రాన్ని సెప్టెంబర్ కు వాయిదా వేసుకునే ఆలోచనను చైతూ చేస్తున్నాడని తెలుస్తోంది. కాగా, చైతూ నటించిన మరో సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో' మాత్రం ముందు ప్రకటించినట్టుగా ఈ నెలాఖరుకి రిలీజ్ అవుతుందట.

English summary
Naga Chaitanya starrer Premam, the eponymous remake of Malayalam blockbuster, was originally planned to be released in August. It turns out, the film might get postponed to September as the makers are yet to complete some crucial portion of the film which will then followed by post-production.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu