ఖరారు : నాగచైతన్యకు జోడీగా శృతిహాసన్

By Srikanya

హైదరాబాద్ : తొలిసారి నాగచైతన్య, శ్రుతి హాసన్‌ కలిసి నటించబోతున్నారు. మలయాళంలో విజయవంతమైన 'ప్రేమమ్‌'ని తెలుగులో 'మజ్ను'గా రీమేక్‌ చేయబోతున్నారు. అందులో నాగచైతన్య హీరోగా నటిస్తారు. 'కార్తికేయ' చిత్రంతో విజయాన్ని అందుకొన్న చందు మొండేటి దర్శకత్వం వహిస్తారు. ముగ్గురు హీరోయిన్స్ కి ఈ చిత్రంలో చోటుంది. ఓ కథానాయికగా శ్రుతి హాసన్‌ నటించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారు.

తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు 'మజ్ను' అనగానే నాగార్జునే గుర్తుకొస్తారు. విషాదంతో కూడిన ఆ ప్రేమకథా చిత్రంలో నాగార్జున అంతగా ఒదిగిపోయి నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలోని గీతాల్ని ప్రేక్షకులు ఇప్పటికీ పాడుకొంటుంటారు. ఇప్పుడు 'మజ్ను' పేరుతో నాగార్జున తనయుడు నాగచైతన్య ఓ చిత్రం చేయబోతున్నట్టు సమాచారం. తండ్రి చేసిన 'మజ్ను' విషాదంతో సాగితే... తనయుడు చేసే సినిమా మాత్రం వినోదాత్మకంగా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.

జార్జ్ అనే కుర్రాడు టీనేజ్ లో, కాలేజ్ లో , సెటిలేజ్ లో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వారి ప్రేమను సాధించుకోవటం లో ఊహించని అడ్డంకులు ఎదురై ,కలలు కరిగిపోయి ప్రేమించిన వారు మరొకరితో సెటిల్ అవ్వతుంటే తట్టుకోలేక గుండె పగిలేలా.. ఇలా కథ సాగుతుంది.

Premam Remake:To star Shruti Haasan with Naga Chaitanya?

ఇక నివిన్ పౌలీ ఈ చిత్రంతో హీరో గా పరిచయమయ్యారు. ఆల్ఫోన్సే పూతరేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కింది. మే 29న విడుదలయిన ఈ చిత్రం పెద్ద హిట్టయ్యింది. జూన్ నెలలో విడుదలైన ఈ 'ప్రేమమ్' చిత్రం టాక్ బాగుండటంతో ... విదేశాలలోనూ విడుదల చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా వసూళ్ళు యాభై కోట్లకు చేరుకున్నాయి.

మళయాళ పరిశ్రమలో ఇలా లో బడ్జెట్ చిత్రం ఈ రేంజిలో హిట్ అయ్యి..ఇంత వసూలు చేయటం పెద్ద రికార్డు. ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం తెలుగు, తమిళ, కన్నడ భాషల నుండే కాకుండా హిందీ పరిశ్రమనుండీ మంచి డిమాండ్ ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X