»   » ప్రధాని మోదీ తో 'బాహుబలి'‌: ఆయనేం అన్నారు(ఫొటోలతో)

ప్రధాని మోదీ తో 'బాహుబలి'‌: ఆయనేం అన్నారు(ఫొటోలతో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సమయం దొరికినప్పుడు 'బాహుబలి' చిత్రాన్ని తప్పక చూస్తా.. అన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. బాహుబలి చిత్ర హీరో ప్రభాస్‌ ఆదివారం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఈ సందర్భంగా బాహుబలి చిత్రాన్ని చూడాల్సిందిగా ఆయన మోదీని కోరారు. ఈ నేపథ్యంలో ప్రధాని పై వ్యాఖ్యలు చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


బాహుబలి సినిమా హీరో ప్రభాస్‌, ఆయన పెద్దనాన్న బీజేపీ నాయకుడు కృష్ణంరాజు, భార్య శ్యామల, బీజేపీ ఏపీ వ్యవహారాల సంధానకర్త పురిఘళ్ల రఘురామ్‌ ఆదివారం సాయంత్రం ప్రధానిని ఆయన నివాసంలో కలిశారు.


భారతీయ సినీ చరిత్రను తిరగరాస్తున్న బాహుబలి చిత్రంపై విమర్శకులతో పాటు రాజకీయ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, భాజపా అగ్రనేత అడ్వాణీ తదితరులు 'బాహుబలి' ఓ అద్భుతమని ప్రశంసించారు.స్లైడ్ షోలో మోదీని కలిసినప్పటి ప్రభాస్ ఫొటోలు..


ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.


'బాహుబలి' సినిమా గురించి మోదీ తమతో మాట్లాడినట్లు ప్రభాస్‌ తన ఫేస్‌బుక్‌ ద్వారా తెలియజేశారు.

'బాహుబలి' సినిమా గురించి మోదీ తమతో మాట్లాడినట్లు ప్రభాస్‌ తన ఫేస్‌బుక్‌ ద్వారా తెలియజేశారు.


పది నిముషాలపాటు

పది నిముషాలపాటు


దాదాపు 10 నిమిషాలపాటు ప్రధానితో వీరి భేటీ సాగింది. ఈ సదర్భంగా ప్రధాని మోదీ బాహుబలి చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించినట్లు తెలిసింది.మోదీకు బాహుబలి గురించి చెప్పారు

మోదీకు బాహుబలి గురించి చెప్పారు


బాహుబలి సినిమా గురించి విన్నానని ఈ చిత్రం చాలా బాగుందని తనకు చాలా మంది చెప్పారని మోదీ అన్నట్లు కృష్ణంరాజు తెలిపారు.ప్రభాస్ మాట్లాడుతూ...

ప్రభాస్ మాట్లాడుతూ...


మోదీతో 10 నిమిషాలు మాట్లాడామని, ఆయనతో మాట్లాడటం చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు.


తప్పకుండా చూస్తాను అన్నారు

తప్పకుండా చూస్తాను అన్నారు


బాహుబలి సినిమా చూడాలని తాను ప్రధానిని కోరగా ప్రస్తుతం బిజీగా ఉన్నానని, తప్పకుండా చూస్తానని చెప్పారని ప్రభాస్ తెలిపారు.


చాలా సంతోషకరమైన రోజు

చాలా సంతోషకరమైన రోజు


తన జీవితంలో ఈ రోజు చాలా సంతోకరమైనదని ప్రభాస్ ఉబ్బితబ్బిబ్బైపోయారు.ఇప్పటికే..

ఇప్పటికే..


హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులు బాహుబలిని చూశారని ఆయన తెలిపారు.బాలీవుడ్‌ ఎంట్రీపై విలేకరులు ప్రశ్నించగా..

బాలీవుడ్‌ ఎంట్రీపై విలేకరులు ప్రశ్నించగా..


ప్రస్తుతానికి బాలీవుడ్‌లో నటించే ఆలోచన తనకు లేదని ప్రభాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తన దృష్టంతా బాహుబలి-2 పైనే ఉందన్నారు.ఖచ్చితంగా నచ్చుతుంది

ఖచ్చితంగా నచ్చుతుంది


మోదీకి సినిమా కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నానన్నారు ప్రభాస్‌.


English summary
"Met 'Baahubali' Prabhas today," Modi posted on social media Sunday with a picture of Prabhas with his uncle, as well as veteran actor Krishnam Raju and his wife. The movie debuted on July 10.
Please Wait while comments are loading...