»   » గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు-అజిత్ ల కాంబినేషన్....

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు-అజిత్ ల కాంబినేషన్....

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఏ మాయ చేశావె" చిత్రాన్ని తెలుగులో నాగచైతన్యతోనూ, తమిళంలో శింబుతోనూ ఏకకాలంలో చేసిన దర్శకుడు గౌతమ్ మీనన్ మరోమారు అదే తరహా ప్రయత్నం చెయ్యనున్నారు. ఈసారి మహేష్, అజిత్ ల కాంబినేషన్ కి ఆయన రంగం సిద్దం చేసుకుంటున్నారని సమాచారం. అలాగని మహేష్, అజిత్ లు ఒకే సినిమాలో కనిపించరని ఒకే సినిమాలో నటిస్తారంతే. విషయానికొస్తే అజిత్ 50వ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రానికి దయానిధి అలగిరి నిర్మాణ సారద్యం వహిస్తారు. పూర్తి స్థాయి జేమ్స్ బాండ్ ఫిల్మ్ గా రూపొందే ఆ చిత్రం తెలుగులో మహేష్ కి మాత్రమే యాప్ట్ అనేది గౌతమ్ అభిప్రాయం.

అయితే ప్రిన్స్ కి కూడా జేమ్స్ బాండ్ గా కనిపించాలనే ఆలోచన ఎప్పట్నుంచో వుంది కనుక గౌతమ్ ప్రపోజల్ కి సానుకూలంగా స్పందించారట. అజిత్ కుమార్ కూడా ఎఫ్2 టోర్నమెంట్ (కార్ రేసింగ్) లో ఉన్నారు. ఆయన యూరప్ నుండి తిరిగి రాగానే షూటింగ్ మొదలుపెడతామని గౌతమ్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu