»   » నచ్చకే అతన్ని వదిలించుకున్నా... అర్జున్ రెడ్డి దర్శకుడు..

నచ్చకే అతన్ని వదిలించుకున్నా... అర్జున్ రెడ్డి దర్శకుడు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

శివ చిత్రం తర్వాత అత్యంత సాంకేతిక విలువలు ఉన్న చిత్రంగా ప్రశంసలు అందుకుంటున్న అర్జున్ రెడ్డికి అనేక మంది ప్రముఖుల ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా అర్జున్ రెడ్డిని ప్రిన్స్ మహేష్ బాబు ప్రశంసించారని విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు సందిప్ రెడ్డి వంగా శుక్రవారం ఓ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మహేష్ స్వయంగా ఫోన్ చేసి....

మహేష్ స్వయంగా ఫోన్ చేసి....

అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు స్వయంగా ఫోన్ చేసి తనను అభినందించారని సందీప్ చెప్పారు. వీలు కుదిరినప్పుడు భవిష్యత్తులో సినిమా చేద్దామని ప్రిన్స్ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మహేష్ నుంచి అభినందనలు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహేష్ తో సినిమా చేయాలనే కోరిక తనకు ఉందని ఈ సందర్బంగా సందీప్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆ అవకాశం కోసం ఎదురు చుస్తున్నట్లు తెలిపారు.

తోట రాజుకు ప్రశంసలు..

తోట రాజుకు ప్రశంసలు..

అర్జున్ రెడ్డి సినిమాకు మదట్లో పని చేసిన సినిమాటోగ్రాఫర్ తొలగించడంపై దర్శకుడు సందీప్ వివరణ ఇచ్చారు. ఆ తర్వాత తోటరాజును కేమెరామెన్ గా నియమించినట్లు చెప్పారు. తోటరాజు అందించిన ఫోటోగ్రఫీకి విమర్శకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయని పేర్కొన్నారు.

ఎలాంటి ఫీలింగ్స్ లేవ్...

ఎలాంటి ఫీలింగ్స్ లేవ్...

కెమెరామెన్ తో క్రియేటివిటికి సంబంధించిన విభేదాలు ఉండేవని... ఈ నేపథ్యంలో అతడిని తొలగించినట్లు వెల్లడించారు. ఆ విషయంలో తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని తెలిపారు. బహుశా పిచ్చిముండా కొడుకును వదిలించుకునానని అతడు అనుకుని ఉంటాడనె అభిప్రాయాన్ని సందీప్ వ్యక్తం చేశారు. ఎవరి స్క్రీన్ ప్లేలో వారే హీరో అన్ని సందీప్ తన అభిప్రాయాన్ని బల్ల గుద్దీ మరీ స్పష్టం చేశారు.

రూ. 50 కోట్లు వసూలు చేస్తాయి...

రూ. 50 కోట్లు వసూలు చేస్తాయి...

అర్జున్ రెడ్డి కలెక్షన్ పరంగా దూసుకెళ్తుందని చెప్పారు. ఇప్పటికే రూ. 30 కోట్లకు పైగా వసూళ్లను సాధించిందన్నారు. అయితే ఈ చిత్రం రూ. 50 కోట్లు వసూలు చేయవచ్చని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
After sensational hit of arjun reddy, its director sandeep reddy vanga speaks with a media. he shares, views about his personal and professional life. sandeep revealed about arjun reddy shooting details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu