»   » మహేశ్ ‘స్పైడర్‌’ రిలీజ్ కష్టాలు.. రంగంలోకి బాహుబలి టీమ్..

మహేశ్ ‘స్పైడర్‌’ రిలీజ్ కష్టాలు.. రంగంలోకి బాహుబలి టీమ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రిన్స్ మహేశ్‌బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ స్పైడర్. ఈ చిత్రాన్ని దర్శకుడు మురుగదాస్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మహేశ్ ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ప్రిన్స్ జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ జూన్ 23 తేదీ నుంచి ఆగస్టుకు వెళ్లిందనే వార్తలు వస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం సెప్టెంబర్ వరకు వెళ్ల వచ్చనే టాక్ వినిపిస్తున్నది.

సినిమా అవుట్‌పుట్..

సినిమా అవుట్‌పుట్..

స్పైడర్ చిత్రం అనుకున్నట్టుగా జూన్ 23న రావడం కష్టం కావడంతో రిలీజ్ డేట్ ఆగస్టుకు మార్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆగస్టులో కూడా ఈ సినిమా రావడం కష్టమే అని అంటున్నారు సినీ వర్గాలు. సినిమా అవుట్‌పుట్ సరిగా లేకపోవడమే ఆలస్యానికి కారణమని తెలుస్తున్నది.


క్వాలిటీ పరంగా..

క్వాలిటీ పరంగా..

బాహుబలి2 సినిమా తర్వాత ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగాయని, అందుకే స్పైడర్ క్వాలిటీ మరింత మెరుగ్గా ఉండేందుకు చర్యలు తీసుకొంటున్నారనే ఫిలింనగర్ టాక్. సినిమాను పక్కాగా, టెక్నికల్‌గా అద్బుతంగా తీర్చిదిద్దేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.


బాహుబలి తర్వాత..

బాహుబలి తర్వాత..

స్పైడర్ సినిమాకు సంబంధించిన విజ్వువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను మకుట గ్రాఫిక్స్, కమల్ కన్నన్ చేపట్టినట్టు తెలుస్తున్నది. తొలుత కంప్యూటర్ గ్రాఫిక్స్, విజ్వువల్ ఎఫెక్ట్స్‌పై అంతగా దృష్టిపెట్టలేదు. కానీ బాహుబలి చూసిన తర్వాత సాధారణ స్థాయిలో ఉంటే ప్రేక్షకులకు ఎక్కడం కష్టమనే భావనలో నిర్మాతలు పడినట్టు తెలుస్తున్నది.


టైమ్ కావాలి..

టైమ్ కావాలి..

స్పౌడర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్‌ వర్క్‌ను చేపట్టడానికి తగిన సమయం ఇవ్వాలని మకుట బృందం స్పష్టం చేసినట్టు సమాచారం. తక్కువ సమయంలో హడావిడిగా చేయడం కుదరదని, ఒకవేళ అలా చేస్తే సంస్థకు ఉన్న క్రెడిట్ దెబ్బ తినే ప్రమాదం ఉంటుందని చెప్పినట్టు సమాచారం. దాంతో ఆగస్టులో విడుదల అవుతుందని అనుకొన్న సినిమా సెప్టెంబర్ వరకు వెళ్లే అవకాశం ఉందంటున్నాయి సినీ వర్గాలు.English summary
As per reports from film Industry, Mahesh Babu's upcoming movie Spider directed by Murugadoss will be delayed further. Earlier Spyder was pushed from June 23rd to August and the latest buzz suggests that it will not come out until September.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu