»   » కృష్ణ‌గారు చేయమంటే చేశా, తర్వాత ఎన్టీఆర్ కాళ్ల మీదపడ్డా...కమెడియన్ పృధ్వి

కృష్ణ‌గారు చేయమంటే చేశా, తర్వాత ఎన్టీఆర్ కాళ్ల మీదపడ్డా...కమెడియన్ పృధ్వి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృధ్వి రాజ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పృధ్వి తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ సారి కృష్ణగారి సినిమాలో ఎన్టీఆర్ మాదిరిగా నటించడం వల్ల తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు.

నటుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓసారి కృష్ణగారు పిలిచి ఏదో ఒక క్యారక్టర్ ఇచ్చారు. రామారావుగారిలా చేయమన్నారు. అపుడు నాకేమీ తెలియదు. చేసేశాను. కానీ ఎన్టీఆర్ పాత్రను విలన్ గా చూపించారనే టాక్ వచ్చింది. దాని పర్యవసానం అసలు ఊహించలేదు. అభిమానులు నన్ను కొట్టడానికి వచ్చారు, నేను పారిపోయాను అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఊహించని పరిణామాలు ఎదుర్కొన్నాను అని పృధ్వి తెలిపారు.

టీడీపీ, కాంగ్రెస్ అని తెలియదు

టీడీపీ, కాంగ్రెస్ అని తెలియదు

అపుడు ఇండస్ట్రీలో టీడీపీ, కాంగ్రెస్ ఇలా ఉంటుందని తెలియదు. కృష్ణగారు పిలిచి రామారావుగారిలా వేషం వేయమంటే వేశాను. నేను ఆ వేషం వేయడం చాలా మందికి నచ్చలేదు. కృష్ణ గారి దగ్గరకు వెళ్లి అడిగితే ‘ఏమీ అనరయ్యా ఆయన.. బయపడకు' అన్నారు.... అని పృధ్వి తెలిపారు.

అలా అయింది నా పరిస్థితి

అలా అయింది నా పరిస్థితి

ఏదో సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు... నన్ను రేప్ చేసి నా జీవితం నాశనం చేశావ్, నేను ఇపుడు ఎలాగ సమాజంలో తలెత్తుకుని తిరగాలి అనే టైపులో అయింది. ఏ ఆఫీసుకు వెళ్లినా, రామారావుగారిని విలన్ లా చూపించే పాత్రలో చేస్తావా, నీకు అవకాశాల్లేవు అంటూ వెనక్కి పంపేవారు... అని పృధ్వి తెలిపారు.

వెళ్లి ఎన్టీఆర్ కాళ్ల మీద పడ్డాను

వెళ్లి ఎన్టీఆర్ కాళ్ల మీద పడ్డాను

దీంతో ఓసారి పెద్ద దండపట్టుకుని ఎన్టీఆర్ గారిని కలిసేందుకు వెళ్లాను. నాతో పాటు మాధవరావుగారు, ఇంకొందరు వచ్చారు. ఎన్టీఆర్ మెడలో దండ వేసి ఆయన కాళ్ల మీద పడిపోయాను. అపుడు పక్కనే శ్రీపతి రాజేశ్వరావు అనే ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రెసిడెంట్ ఉన్నారు. వీడే సార్.. వీడేసార్ అంటూ అనడం మొదలు పెట్టారు. ఓరినాయనో నేనేం చేయలేదు, నాకేం తెలియదు అని ఎన్టీఆర్ గారిని వేడుకున్నాను..... అని పృధ్వి తెలిపారు.

ఎన్టీఆర్ చూపుతో అంతా సైలెంట్ అయిపోయారు

ఎన్టీఆర్ చూపుతో అంతా సైలెంట్ అయిపోయారు

ఎన్టీఆర్ ఒక్కసారి ఇలా చూడటంతో అంతా సైలెంట్ అయిపోయారు. నాకు ఏం తెలియదండీ, తాడేపల్లిగూడెం నుండి వచ్చాను. సినిమాలో వేషం ఇస్తే చేశాను అని చెప్పాను. అపుడు ఎన్టీఆర్ గారు... బ్రదర్ మీకు ఓర్పు ఉండాలి ఇండస్ట్రీలో, ఇలాంటివి ఎప్పుడూ చేయకుండి, స్వార్థం కోసం వాడుకుంటారు మిమ్మల్ని అని చెప్పారు..... అని తెలిపినట్లు పృధ్వి గుర్తు చేసకున్నారు.

ఎన్టీఆర్‌గారు ఆశీర్వదించారు

ఎన్టీఆర్‌గారు ఆశీర్వదించారు

తర్వాత ఎన్టీఆర్ గారు నాకు స్వయంగా బొట్టు పెట్టి, మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పారు. పౌరాణికాలు, మంచి క్యారెక్టర్లు వస్తే చేయండి అన్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది. భుజం మీద చెయ్యేసి ఫోటో దిగారు. ఇప్పటికీ ఆ ఫోటో మా ఇంట్లో ఉంది అని పృధ్వి తెలిపారు.

ఆయన ఆపలేదు, వీళ్లే భయపడ్డారు

ఆయన ఆపలేదు, వీళ్లే భయపడ్డారు

ఎన్టీఆర్ గారు నన్ను చూసి శివ తత్వం ఉందని చెప్పారు. ఆయన్ను కలిసి వచ్చిన తర్వాత అరకొరగా వేశాలు ప్రారంభం అయ్యాయి. అంతకు ముందు ఎన్టీఆర్ గారు నాకు అవకాశాలు రాకుండా ఏమీ ఆపలేదు, ఆయనకు భయపడి ఆయన భక్తులు అవకాశాలు ఇవ్వలేదు. ఆయన్ను కలిసిన తర్వాత అంతా సెట్టయిపోయింది అని పృధ్వి తెలిపారు.

ఎన్టీఆర్‌గారు సీఎం అయిన తర్వాత

ఎన్టీఆర్‌గారు సీఎం అయిన తర్వాత

ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత పతేమైదానంలో మీటింగ్ పెట్టారు. నేను విజయవాడ నుండి పెద్ద దండపట్టుకుని వెళ్లాను. అక్కడికి వెళ్లిన తర్వాత ప్రోటోకాల్ లేనిదే స్టేజీమీదకు వెళ్లడానికి కుదరదు అన్నారు. 77వ పేరులో అమితాబ్ బచ్చన్, అనీల్ కపూర్ ఉన్నారు. ఒక వెండి గ్లాసులో మిర్యాల పాలు పట్టుకుని పక్కన మోహన్ బాబుగారు ఉన్నారు. లక్షల జనం వచ్చారు. నేను దండ పట్టుకుని స్టేజీ కింద ఉన్నాను. అపుడు అనుకోకుండా ఎన్టీఆర్ గారు నా వైపు చూసి బ్రదర్ పృధ్వీరాజ్ గారు రండి అన్నారు. ఆయన పిలవడంతో కాళ్లు చేతులు చల్లబడిపోయి చమటలొచ్చాయి. ఏం బ్రదర్ ఎలా ఉన్నారు అన్నారు. ఇది నాకు చాలు అనిపించింది.... అని పృధ్వి అన్నారు.

ఎమ్మెల్లే అయ్యేవాన్ని

ఎమ్మెల్లే అయ్యేవాన్ని

ఆయనతో దిగిన ఫోటో పెట్టుకుని తాడే పల్లిగూడెంలో నాలుగు ప్లెక్సీలు వేసి ఉంటే మునిసిపల్ చైర్మన్ నుండి ఎమ్మెల్యే అయిపోయి, ఇపుడు మినిస్టర్ అయిపోయేవాన్నేమో... తర్వాత వంద పార్టీలు మారేవాన్నేమో అది వేరే సంగతి... అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు పృధ్వి.

English summary
Prithviraj about how Sr Ntr saving his life. "NTR helped me say that I have been in the industry." Prithviraj said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X