»   » దిల్ రాజు సినిమాలో ఆఫర్ నా అదృష్టం: 'లీడర్‌' హీరోయిన్

దిల్ రాజు సినిమాలో ఆఫర్ నా అదృష్టం: 'లీడర్‌' హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"నేను ఫస్ట్‌ నుంచీ సినిమా లవర్‌ ని. హీరోయిన్‌ అవ్వాలని మాత్రం కోరుకోలేదు. సినీరంగంలోనే ఏదో ఒక డిపార్ట్‌మెంట్‌లో ఉండాలని కోరుకున్నాను. అనుకోని అవకాశం 'లీడర్‌' రూపంలో వరించింది.వెంటనే దిల్‌ రాజు 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రంలో కూడా చేస్తున్నాను. వరుసగా పెద్ద సినిమాలు చేయడం నిజంగా నా అదృష్టం. నటిగా నేనేంటో నిరూపించుకున్న తర్వాత మిగిలిన శాఖల్లో కూడా నా ప్రతిభను నిరూపించుకోవడానికి యత్నిస్తానుఅంటోంది ప్రియా ఆనంద్. అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈమె శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్‌' సినిమాలో యువ ముఖ్యమంత్రిని(రాణా) ని పెళ్లాడాలని కలలు కంటూ...అతని వెనుకే తిరుగుతుంటూండే క్యారెక్టర్ చేసింది. సినిమా సంగతి ఎలా ఉన్నా ఈ పాత్ర చేసిన ప్రియా ఆనంద్ కు పరిశ్రమలోని పెద్ద పెద్ద సంస్ధలు నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. మరో పెద్ద హీరో చిత్రం కోసమూ ఆమెను అడిగినట్లు తెలుస్తోంది. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' లో రామ్ హీరోగా చేస్తున్నారు. అర్జున్ మరో కీలకపాత్ర చేస్తూండగా, ప్రియా ఆనంద్ ఓ హీరోయిన్ గా చేస్తోంది. గోపీచంద్, అనూష్కలతో లక్ష్యం చిత్రం రూపొందించిన దర్శకుడు వాసు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu