»   » ముగ్గరు హీరోయిన్లతో స్క్రీన్ షేర్ పట్ల నాకభ్యంతరం లేదు..!

ముగ్గరు హీరోయిన్లతో స్క్రీన్ షేర్ పట్ల నాకభ్యంతరం లేదు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అదేమిటో గానీ... హీరోయిన్ ప్రియా ఆనంద్ ఇంతవరకు చేసిన సినిమాలన్నీ ఇద్దరు హీరోయిన్ల సినిమాలే. పైగా, తను వాటిలో చేసింది సెకండ్ హీరోయిన్ వేషాలే. తొలి చిత్రం 'లీడర్', తర్వాత 'రామరామ కృష్ణకృష్ణ ', ఇప్పుడు మూడో సినిమా '180"లో నిత్య మీనన్ తో కలిసి చేసింది. అయితే, తనకు మాత్రం సోలో హీరోయిన్ గానే చేయాలి... ఇలాంటివి చేయకూడదు.. అని మాత్రం లేదట.

'మరో హీరోయిన్‌ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల నాకభ్యంతరం లేదు. కథ ప్రకారం ముగ్గురు హీరోయిన్లున్నా కూడా నో ప్రాబ్లం' అంటోంది ప్రియ నవ్వుతూ. ఇప్పుడు తను ఈ '180" సినిమా మీద చాలా ఆశలే పెట్టుకుంది. తెలుగు, తమిళ భాషల్లో తనకీ చిత్రం మంచి బ్రేక్ అవుతుందని ఆశిస్తోంది. అన్నట్టు, ప్రియా ఆనంద్ లో తెలుగు మూలాలు వున్నాయి. వాళ్ల అమ్మ తమిళ్ అయితే, వాళ్ల నాన్న తెలుగు-మరాఠీ మిక్స్ అట!

English summary
Priya Anand, The leader girl is getting offers one after another with her debut success. Heroine is already played solo heroine role in Ram's film 'Rama Rama Krishna Krishna' and now it is known that she got another offer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu