»   » ప్రియమణికి తెరపై మగాళ్లంటే ద్వేషం...తెరవెనక

ప్రియమణికి తెరపై మగాళ్లంటే ద్వేషం...తెరవెనక

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోపీచంద్ ఫెంటాస్టిక్ యాక్టర్. రీల్ లైఫ్, రియల్ లైఫ్ రెండింటిలోనూ ఆయన సెన్సార్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది. సెట్స్ మీద తనుంటే సరదాగా గడిచిపోతుంది. ఆయనది మంచి ఫ్రెండ్లీ మ్యానర్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతోంది ప్రియమణి. గోపీచంద్ సరసన ప్రియమణి చేసిన గోలీమార్ చిత్రం నిన్న(గురువారం) రిలీజైంది. ఇక చిత్రంలో తన పాత్ర గురించి చెబుతూ..ఇందులో నా పేరు పవిత్ర. ఈవెంట్ ఆర్గనైజర్‌ని. మగాళ్లంటే అస్సలు పడదు. అలాంటి దాన్ని హీరో పరిచయం తర్వాత నెమ్మది నెమ్మదిగా మారిపోతా. మగాళ్ల పట్ల నాకెందుకంత ద్వేషమనే దానికి చిన్న ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. మా అమ్మ అలా పెంచుతుంది. ఈ పాత్ర నాకు చాలా సంతృప్తిని చ్చింది. ఇప్పుడు అందరూ నా నటనని మెచ్చుకోవడం ఆనందంగా ఉంది అంటోంది ప్రియమణి. అలాగే ఈ సినిమాలో బాగా గ్లామరస్‌గా కనిపించడానికి ప్రత్యేకంగా నేను చేసిందేమీ లేదు. పూరిగారు ఇందులో నేను కాస్త డిఫరెంట్‌గా కనిపించాలని చెప్పారు. అందువల్ల కాస్త శ్రద్ధ తీసుకున్నానంతే అని వివరించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu