»   » ‘రక్త చరిత్ర1’ వివేక్ ఇచ్చినంత క్రేజ్ ‘రక్త చరిత్ర పార్ట్ 2’తో ప్రియమణికి...

‘రక్త చరిత్ర1’ వివేక్ ఇచ్చినంత క్రేజ్ ‘రక్త చరిత్ర పార్ట్ 2’తో ప్రియమణికి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పరిటాల రవి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందించిన చిత్రం 'రక్తచరిత్ర". ఈ చిత్రాన్ని పార్ట్‌ 1గా, పార్ట్‌ 2గా రెండు భాగాలు చేసిన వర్మ..పార్ట్‌ ను ఇటీవలే విడుదల చేసిన విషయం మీకు తెలిసిందే. ఈ పార్ట్‌ 2కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక పార్ట్‌ 2 కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తెలుగులో నాగార్జున సరసన'రగడ" తో పాటు సుమంత్ తో మరో చిత్రం, కన్నడంలో సుదీప్, శివరాజ్ కుమార్, దర్శన్ లతో ఒక్కో చిత్రం చేస్తున్నాను. ఇన్ని చిత్రల్లో ఏకకాలంలో నటిస్తున్నా నటన అంటే నాకు బోర్ కొట్టకపోవటానికి ప్రధాన కారణం ప్రతి చిత్రంలోనూ నా పాత్ర వైవిద్యంగా వుండటమే" అంటున్నారు" ప్రియమణి.

కాగా ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ ప్రియమణి ఓ కీలక పాత్రను పోషించారు. ఈ విషయాన్ని ప్రియమణి తెలియజేస్తూ...'నేను 'రక్తచరిత్ర" పార్ట్‌1ను చూశాను. నాకు బాగా నచ్చింది. ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణే వస్తోంది. ఇక ఈ చిత్రం పార్ట్‌ 2లో నేను ఓ ముఖ్యమైన పాత్రను పోషించాను. ఎంతో వైవిధ్యమైన పాత్ర అది. నా కెరీర్‌ కు ఎంతో ప్లస్‌ అవుతుంది. నాకిష్టమైన దర్శకుల్లో ఒకరైన రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో నటించడం నాకెంతో సంతోషంగా వుంది. 'రక్తచరిత్ర" పార్ట్‌1ను చూసిన ప్రేక్షకులు పార్ట్‌2 గురించి ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో నేను కూడా అంతే క్యూరియాసిటీతో వున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu