»   » హీరోయిన్ ప్రియమణి పెళ్లి సందడి మొదలైంది!

హీరోయిన్ ప్రియమణి పెళ్లి సందడి మొదలైంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ బ్యూటీ ప్రియమణి పెళ్లి సందడి మొదలైంది. మరో వారంలో ఆమె తను కోరుకున్న ప్రియుడిని పెళ్లాడబోతోంది. ఆగస్టు 25న ప్రియమణి-ముస్తపారాజ్ వివాహం జరుగబోతోంది. పెళ్లి వేడుక ప్రైవేట్ కార్యక్రమంగా జరుగబోతోంది. అయితే వెడ్డింగ్ రిసెప్షన్ సినీ ప్రముఖల సమక్షంలో గ్రాండ్ గా జరుగబోతోంది.

వెడ్డింగ్ సెర్మనీ మూడు రోజుల పాటు జరుగబోతోంది. మొహందీ, సంగీత్, కాక్ టెయిల్ పార్టీ, రిసెప్షన్ వేడుక ఒకదాని వెనక ఒకటి జరుగనున్నాయి. ఇప్పటికే సినిమాలకు వీలైనంత దూరంగా ఉంటున్న ప్రియమణి పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలు మానేస్తుందని సమాచారం.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

గత ఐదేళ్లుగా ప్రియమణి-ముస్తఫా రాజ్ ప్రేమించుకుంటున్నారు. ముస్తఫా రాజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ఓసారి ఐపీఎల్ మ్యాచ్‌లో ముస్తఫా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

ప్రియమణి

ప్రియమణి

ముస్తఫా యాటిట్యూడ్, అతడి నిజాయితీ, సెన్సాఫ్ హ్యూమర్ నాకు బాగా నచ్చింది అందుకే అతని ప్రేమలో పడిపోయాను అని ప్రియమణి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

గతేడాది ఎంగేజ్మెంట్

గతేడాది ఎంగేజ్మెంట్

2016 మే 27వ తేదీన ప్రియమణి-ముస్తఫా రాజ్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి కోసం సంవత్సరకంటే ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు. ఈ ఐదేళ్ల పరిచయంలో ఎలాంటి విబేధాలు, మనస్పర్థలు లేకుండా వీరి రిలేషన్ కొనసాగుతుండటం విశేషం.

సహజీవనం

సహజీవనం

ఎంగేజ్మెంట్ తర్వాత నుండి ప్రియమణి-ముస్తఫా రాజ్ కలిసే ఉంటున్నారని, అఫీషియల్‌గా పెళ్లి జరుగడం తప్ప సంవత్సర కాలంగా దాదాపుగా భార్య భర్తల్లానే జీవిస్తున్నారని టాక్. ఈ నెల 25న ఇద్దరూ అఫీషియల్ గా భార్య భర్తలు కాబోతున్నారు.

English summary
Actress Priyamani who ruled the Telugu film industry is all set to get hitched this month with her boyfriend. Priyamani was engaged to her boyfriend Mustafa Raj a long back, is going to marry him on August 25.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu