»   » నయనతార చిత్రంలో ప్రియమణి గెస్ట్ రోల్!

నయనతార చిత్రంలో ప్రియమణి గెస్ట్ రోల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సౌతిండియా హాట్ హీరోయిన్ నయనతార బాలీవుడ్ మూవీ 'కహానీ'కి రీమేక్ గా రూపొందుతున్న 'అనామిక' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు/తమిళంలో ఒకేసారి రూపొందుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రంలో హీరోయిన్ ప్రియమణి అతిథి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

గెస్ట్ రోల్ చేయడానికి ప్రియమణి ఒప్పుకుందని, ప్రియమణిపై త్వరలో కొన్ని సీన్లు చిత్రీకరించడానికి దర్శకుడు శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ విషయం అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది. ఎండర్ మోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలక్ట్ మీడియా హోల్డింగ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కహానీ చిత్రం కోల్ కతా బ్యాక్ డ్రాప్‌తో సాగుతుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.

ఈ చిత్రానికి ప్రముక నావెలిస్ట్ యండమూరి వీరేంద్రనాధ్ ఈ చిత్రానికి సహాయ రచయితగా పని చేస్తున్నారు. విజయ్ సి. కుమార్ సినిమాగ్రఫీ చేయనున్నారు. సినిమా కథ విషయానికొస్తే... కనిపించకుండాపోయిన తన భర్త గురించి ఒక ఎన్ ఆర్ ఐ గర్భిణి చేసే అన్వేషణే ఈ కహానీ చిత్ర కథ. అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి‌తో చేసిన ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించడంతో తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.

ఈ చిత్రం గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...కహానీ తెలుగు, తమిళం రీమేక్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని, ఇక్కడి నేటివిటీకి తగిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు వెల్లడించారు. కాగా....బాలీవుడ్ వెర్షన్ 'కహానీ'కి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించగా, విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించింది.

English summary
Film Nagar source said that Sekhar Kammula has roped in Priyamani for a guest appearance in hid nex film Anamika. Rumour mill is that Priyamani has given her nod for Sekhar Kammula. And the director is planning to shot a few scenes on both of them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu