»   »  'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'లో ఐటం డాన్స్ గురించి ప్రియమణి

'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'లో ఐటం డాన్స్ గురించి ప్రియమణి

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్ : షారుఖ్‌ నటించిన తాజా చిత్రం 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'లో ప్రత్యేకగీతంలో ప్రియమణి నర్తించింది. రాజుసుందరం నృత్య దర్శకత్వంలోని ఈ పాటకు మంచి క్రేజ్ వచ్చింది. కాస్ల గ్లామర్‌గానే కనిపిస్తూ.. కుర్రకారు మతిపోయేలా చిందులేసింది. ఈ సినిమా తర్వాత తనకు బాలీవుడ్‌లో అవకాశాలు వస్తాయన్న ఆశాభావాన్ని స్నేహితుల వద్ద వ్యక్తం చేస్తోంది. ప్రత్యేక పాటలో తన స్టెప్పులు ముంబయి వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయని కూడా చెప్తోంది.

  అలాగే ... షారుక్‌తో 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'లో డాన్స్‌ అనుభవం గురించి చెబుతూ.. ''అసలు ఆయనతో డాన్స్‌ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నాకీ అవకాశం వచ్చిందని నా మేనేజర్‌ చెప్తే నమ్మలేకపోయాను. అంతటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో నాకు స్థానం రావడమే అదృష్టమ''అని సంబరపడిపోయానంటోంది. తమిళంలో నటన, తెలుగులో అందాల ఆరబోతతో ప్రేక్షకాభిమానాలను సంపాదించుకుంది ప్రియమణి. తెలుగులో మార్కెట్‌ ఒక్కసారిగా పడిపోవడంతో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఒకమెట్టు దిగి ప్రత్యేకగీతాలకు కూడా సై అంటూ కొందరు దర్శకనిర్మాతలకు సంకేతాలిచ్చింది.

  ఇక ''నా పాత్ర నిడివి ఐదు నిమిషాలా.. పది నిమిషాలా అని నేనెప్పుడూ లెక్కేసుకోను. కథ నాకు నచ్చాలి. చిన్న పాత్రతోనూ అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రేక్షకుల ప్రశంసలు పొందొచ్చు'' అంటోంది ప్రియమణి. ప్రస్తుతం ఈ భామ 'చండి', 'అంగుళీక' లాంటి కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తోంది. మరోవైపు షారుక్‌ ఖాన్‌తో 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'లో ప్రత్యేక గీతంలో ఆడిపాడినందుకు హ్యాపీగా ఉంది. ఎందుకిలా అంటే.. ''ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే నటీనటుల పని.. దానికి మన పాత్ర చిన్నదా పెద్దదా అని చూసుకోకూడద''ని చెబుతోంది.

  ''నేను ఎన్ని సినిమాలు చేసినా నాకు గుర్తుండిపోయే పాత్ర చారులత. అవిభక్త కవలలుగా నటించడానికి చాలా కష్టపడ్డాను. దీనికోసం అలాంటి వాళ్ల వీడియోలు చూశాను. వాళ్లని చూస్తే చాలా బాధ అనిపించింది'' అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి. మరి పెళ్లెప్పుడు అంటే.. ''కుటుంబ సభ్యులతో గడుపుదామంటేనే కుదరడం లేదు. ఇక పెళ్లి గురించి ఆలోచించే సమయమెక్కడిది. ఆ సమయమొచ్చినప్పుడే అందరికీ చెప్పే చేసుకుంటానని'' ముక్తాయిచింది ప్రియమణి.

  English summary
  
 South actress Priyamani is seen shaking a leg with SRK in an item number One Two Three Four in the film. While talking about her experience with the king of romance, Priyamani said, "Shahrukh is sweet. The experience to dance with SRK was lovely." "I would like to thank SRK, Rohit Shetty and the producers to make me part of a film like Chennai Express," added Priyamani.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more