»   » ఆఫర్స్ కోసం ప్రియమణి మరీ అంతలా దిగజారాలా?

ఆఫర్స్ కోసం ప్రియమణి మరీ అంతలా దిగజారాలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మిత్రుడు, గోలీమార్, సాధ్యం, ప్రవరాఖ్యుడు అంటూ వరస వచ్చిన ప్లాపుల పుణ్యమా అని ప్రియమణి పూర్తిగా ఖాళీ పడిపోయింది.దాంతో హిందీలో అయినా అదరకొడదామని ప్రయత్నిస్తే...అక్కడ మణిరత్నం వంటి స్టార్ చేతిలో పడి రావణ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఆమె చూపు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'రక్తచరిత్ర' మీదే ఉంది. ఆ చిత్రం హిట్ అయి ఆమెకు లైఫ్ ఇస్తుందని ఆశిస్తోంది. ఆశించటం వరకూ దాకా బాగానే ఉంది కానీ అవకాశం దొరికినప్పుడల్లా..బాలీవుడ్ అంతకాదు..ఇంతకాదు..అంటూ పొగడ్తలు కురిపించటమే చాలా మందికి మండుకొస్తోంది. అందులో భాగంగా 'ఇక్కడి నటులు చాలా ప్రొఫెషనల్ ‌గా ఉంటారు. ఎటువంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే. 'జోష్‌' సినిమాలో షారుఖ్‌ ఖాన్‌-ఐశ్వర్య రాయ్ ‌లు అన్నాచెల్లెళ్లుగా నటించారు. 'దేవదాస్‌'లో ప్రేమించుకొన్నారు. వృత్తిమీద అంకిత భావమే అదంతా..' అని రీసెంట్ గా ఓ స్టేట్మెంట్ పడేసింది. ఇది విన్నవారంతా ఇన్నాళ్లూ ఇక్కడ సినిమాలు చేసే సంపాదించుకుంది కదా..ఓ రెండు సినిమాలు అదీ చిన్న చిన్న పాత్రలు చేసేసరికి ఎలా మాట్లాడుతోందో కదా...అని కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి కాస్త ప్రియమణి..ఈ భజన కాలక్షేపం ఆపేస్తే భావుంటుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu