»   » ప్రియమణి ఫ్యాన్స్‌కి అందాల విందు (ఫోటోలు)

ప్రియమణి ఫ్యాన్స్‌కి అందాల విందు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఒకప్పటిలా ఇప్పుడు హీరోయిన్ ప్రియమణికి స్టార్ హీరోల సరసన అవకాశాలు లేవు. గతంలో నాగార్జున, జూ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో చేసిన ప్రియమణి ఆ తర్వాత వరుస ప్లాపుల కారణంగా చిన్న సినిమాలకే పరిమితం అయింది. ప్రస్తుతం ఆమె తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది.

సినిమా రంగంలో తన పొజిషన్ ఎలా ఉన్న అభిమానులకు మాత్రం తన గ్లామర్ ప్రదర్శన విషయంలో ఏ లోటూ లేకుండా చూస్తోంది ప్రియమణి. తన ప్రతి సినిమాలోనూ ఫ్యాన్స్‌కు కంటి నిండా అందాల విందుచేస్తోంది. ప్రస్తుతం ప్రియమణి చండీ సినిమాలో నటిస్తోంది.

'చండి' చిత్రం ఆడియో వేడుక ఆగస్ట్ 12న జరుగనుంది. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ అతిథిగా రానున్నారని చెప్తున్నారు. విద్యాబాలన్, ప్రియమణి ఇద్దరూ కజిన్స్ అవటంతో ఆమె రావటానికి ఓకే చేసిందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

‘చండీ' మూవీ యాక్షన్ ఎంటర్టెనర్

‘చండీ' మూవీ యాక్షన్ ఎంటర్టెనర్


ప్రియమణి ప్రధాన పాత్రలో ‘చండీ' మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో...ఆశిష్ విద్యార్థి, వినోద్‌కుమార్, నాగబాబు, అలీ, రంగనాథ్, పోసాని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: కరణం పి.బాబ్జీ, సమర్పణ: జి.జగన్నాథనాయుడు.

సముద్ర దర్శకత్వంలో...

సముద్ర దర్శకత్వంలో...

వి.సముద్ర దర్శకత్వంలో డా.శ్రీనుబాబు.జి నిర్మిస్తున్న ‘చండి' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎస్.ఆర్.శంకర్, చిన్న సంయుక్తంగా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాత శ్రీనుబాబు సన్నాహాలు చేస్తున్నారు.

డేరింగ్ పాత్రలో ప్రియమణి

డేరింగ్ పాత్రలో ప్రియమణి


ఈ సినిమాలో ప్రియమణి ధైర్య వంతురాలుగా, డేరింగ్ లేడీగా కనిపించనుంది. ఇందులో ఆమె గుర్రపు స్వారీ, ఆర్చరీ లాంటి విద్యలను పదర్శించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆయా విభాగాల్లో శిక్షణ కూడా తీసుకుంటోంది.

రాజకీయ నేపథ్యం ఉందా..?

రాజకీయ నేపథ్యం ఉందా..?


ఈ చిత్రంలో ప్రియమణి రాజకీయ నేపథ్యం ఉన్న పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది. ఆమె పాత్ర ఇందిరా గాంధీ స్వభావాన్ని పోలి ఉంటుందా? ఇందిరా గాంధీలా కొందరికి ఆమె పాత్ర కొరకరాని కొయ్యలా ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతుంది.

ఆడియో వేడకకు ప్రభాస్ కూడా వస్తున్నాడా?

ఆడియో వేడకకు ప్రభాస్ కూడా వస్తున్నాడా?


ఈ చిత్రం ఆడియో వేడుకకు ప్రభాస్ కూడా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ లాంటి స్టార్స్‌ను ఆహ్వానించడం ద్వారా సినిమాకు మంచి పబ్లిసిటీ తీసుకురావొచ్చనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కృష్ణం రాజు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

English summary

 Priyamani hot images from Chandi movie, get good response from fans. The audio launch of ‘Chandi’, will be releaseon August 12th. The movie group is wanting to commend the occasion in a grand manner. S.R.Shankar and Chinna are making the music for the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu