»   » ప్రియమణి, జగపతి బాబు సాధ్యం సస్పెన్స్ సినిమానా?

ప్రియమణి, జగపతి బాబు సాధ్యం సస్పెన్స్ సినిమానా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముఖ్యంగా పతాక సన్నివేశాల దాకా విలన్ ఎవరో తెలీదు. ఆ సస్పెన్స్‌ను మా దర్శకుడు బాగా మెయింటైన్ చేశాడు. సరికొత్త కథనం సినిమాకి ప్రాణంగా నిలిచి ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది, విడుదలైన అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది అంటున్నారు సాధ్యం చిత్ర నిర్మాతలు. ప్రియమణి, జగపతిబాబు కాంబినేషన్లో రిలీజైన తమ చిత్రం సాధ్యం చాలా బాగా నడుస్తోందంటూ మీడియాతో మాట్లాడారు. అయితే బయిట టాక్ వేరే రకంగా ఉంది. మొదట రోజునే ఈ చిత్రం సస్పెన్స్ సరిగా మెయింటైన్ చేయలేదంటూ టాక్ వచ్చింది. అలాగే చిత్రం కలెక్షన్స్ మొదటి రోజు నుంచి డ్రాప్ అవటం ప్రారంభమయ్యాయి.

అలాగే వారు...ప్రియమణి గురించి మాట్లాడుతూ...ఆమె జాతీయ ఉత్తమ నటి. పాత్రను అర్ధం చేసుకుని అద్భుతంగా నటించిందంటూ మెచ్చుకున్నారు. అయితే ఈ చిత్రం కొద్దో గొప్పో ఓపినింగ్స్ ని తెచ్చుకుందుంటే అది ప్రియమణి చలవే. ఆమెను శృంగాపరంగా చూపిస్తూ వేసిన పోస్టర్స్ వేసారు. అలాగే సినిమాలో బేలగా ఉన్న ఆమె పాత్రను బాగా సెక్సీ గా చూపటంతో క్యారెక్టర్ ఔన్నిత్యం పడిపోయిందంటూ విమర్శలు వచ్చాయి. ఇక ప్రియమణి, జగపతి బాబు కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం ఇది. పెళ్ళయిన కొత్తలో చిత్రంలో హిట్టయిన ఈ కాంబినేషన్ ప్రవరాఖ్యుడుతో చతికిల పడింది. ముచ్చటగా మూడో సారి సాధ్యం టేటిల్ తో తెరకెక్కింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu