»   » అరుంధతి కంటే నాగపెంచలమ్మఅదరగొడుతుందా..?

అరుంధతి కంటే నాగపెంచలమ్మఅదరగొడుతుందా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జగపతి బాబు, ప్రియమణి, 'కిక్" శ్యామ్ ముఖ్యతారలుగా శ్రీ బాలాజీ మూవీ మేకర్స్ పతాకంపై టి. వేణుగోపాల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'క్షేత్రం". వై.ఎస్‌పతాప్ రెడ్డి సమర్పణలో టి.గోవిందరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ ' ఇప్పటి వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లలో చిత్రీకరణ చేశాం. ఈ నెల 16 నుంచి మలేషియాలో రెండు పాటలను చిత్రీకరిస్తున్నాం. డ్యాన్స్ మాస్టర్ హరీష్‌ పాయ్ నృత్య దర్శకత్వంలో ప్రియమణి, శ్యామ్‌ లపై ఈ పాటల చిత్రీకరణ జరుపుతున్నాం. ఈ నెల 28 వరకు మలేషియాలో జరిగే షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తాం. దీంతో 95 శాతం షూటింగ్ పూర్తవుతుంది. త్వరలోనే ఆడియోను విడుదల చేస్తాం" అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ 'చారిత్రాత్మక నేపథ్యంలో కొనసాగే ఈ చిత్రం నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా వుంటుంది. నాగపెంచలమ్మగా ప్రియమణి, వీరనరసింహారాయలుగా జగపతిబాబు అభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. నేటి ట్రెండ్‌ లో నడిచే ఈ కథ అనుకోకుండా చారిత్రాత్మక నేపథ్యంలోకి మలుపు తిరుగుతుంది. ఇందులో భాగంగా వచ్చే ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్ చిత్రానికి హైలైట్‌గా వుంటుంది" అని తెలిపారు. అంటే ఈ సినిమా లో ప్రియమణి నాగపెంచలమ్మగా అరుంధతి రేంజ్ లో అదరగొడుతుందని సమాచారం. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఆదిత్యమీనన్, రాజీవ్ కనకాల, ఉత్తేజ్, అక్కినపల్లి రాజ్‌కుమార్, బ్రహ్మాజీ, అన్నపూర్ణమ్మ, హేమ, శివపార్వతి తదితరులు ముఖ్యపావూతల్లో నటిస్తున్నారు.

English summary
‘Kshetram’ starring Jagapathi Babu and Priyamani in the lead, ‘Kick’ Shyam in key role is taking shape in the hands of director T Venu Gopal. A few key sequences were recently shot on a specially erected set in Ramoji Film City.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu