»   » ప్రేమించిన వాడితో ప్రియమణి వివాహం వాయిదా, కారణం ఏమిటి?

ప్రేమించిన వాడితో ప్రియమణి వివాహం వాయిదా, కారణం ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ ప్రియమణి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఓనర్ ముస్తఫా రాజ్‌తో గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతున్న ప్రియమణి ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని నెలల క్రితమే బహిర్గతం చేసింది.

వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని తొలుత నిర్ణయించుకున్నప్పటికీ.... తాజాగా నిర్ణయం మార్చుకున్నారు. ప్రియమణి జాతకం ప్రకారం పెళ్లి తేదీ విషయంలో మార్పులు చేయాల్సి వచ్చింది. దీంతో మరికొంత కాలం వెయిట్ చేయాలని భావిస్తున్నారు. ఇరు కుటుంబాల వారు జాతకాలను బాగా నమ్మే వారు కావడంతో వాయిదా విషయంలో అందరూ ఒకే మాటపై ఉన్నారు.

అయితే ప్రియమణి సన్నిహితులు చెబుతున్న వివరాల ప్రకారం.... ఇద్దరి వివాహం వాయిదా పడిన మాట వాస్తవమే కానీ, మరీ ఎక్కువ ఆలస్యం ఏమీ కాదని, త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అంటున్నారు.

ప్రియమణి-ముస్తఫా

ప్రియమణి-ముస్తఫా


ప్రియమణి, ముస్తఫా రాజ్ మధ్య దాదాపు మూడేళ్లుగా స్నేహం సాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

ప్రియమణి

ప్రియమణి


ఇరు కుటుంబాల వారు వీరి వివాహానికి ఒకే చెప్పారు. వచ్చే ఏడాది ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు.

సినిమా-వ్యాపారం

సినిమా-వ్యాపారం


ముస్తఫా వ్యాపార రంగానికి చెందిన కుటుంబం నుండి వచ్చినవాడు. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు.

ప్రియమణి-ముస్తఫా రాజ్

ప్రియమణి-ముస్తఫా రాజ్


సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ కలిసి వివిధ పర్యాటక ప్రదేశాల్లో పర్యటిస్తూ ఎంతో జాలీగా గడుపుతున్నారు.

మెచ్చినవాడు

మెచ్చినవాడు


ముస్తఫా రాజ్ తనను బాగా అర్థం చేసుకున్నాడని, అతనితో జీవితం పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని అంటున్నారు.

లవ్ కమ్ అరేంజ్డ్

లవ్ కమ్ అరేంజ్డ్


ముస్తఫా రాజ్ తో తన వివాహం లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని ప్రియమణి చెప్పుకొచ్చింది.

సీక్రెట్‌గా...

సీక్రెట్‌గా...


తమ ప్రేమ విషయం బయట పడక ముందు ప్రియమణి, మస్తఫా రాజ్ మీడియా కంటపడకుండా రహస్యంగా సంచరించే వారు.

ఫ్యాన్స్ షాక్

ఫ్యాన్స్ షాక్


ప్రియమణి ఉన్నట్టుండి తన పెళ్లి విషయం, ప్రేమ విషయం బయట పెట్టడం అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.

సూపర్ జోడీ...

సూపర్ జోడీ...


ప్రియమణి, ముస్తఫా రాజ్ సరిజోడీ అని, ఇద్దరూ ఒకరికొకరు బాగా సెట్టయ్యారని వారి సన్నిహితులు అంటున్నారు.

English summary
It is known that Priyamani has openly stated that she is seeing Mustafa Raj, an event management company owner from Mumbai, soon after we broke the news in April. The actress has officially confirmed the news that she is planning to marry next year and it will be a love cum arranged marriage. However, the marriage has been postponed for now.
Please Wait while comments are loading...