»   »  హాట్ టాపిక్ 'ప్రియమణి'

హాట్ టాపిక్ 'ప్రియమణి'

Posted By:
Subscribe to Filmibeat Telugu
Priyamani
ప్రియమణి కలలు ఇన్నాళ్ళకు ఫలించాయి. తమిళ చిత్రం 'పరుత్తి వీరన్' సినిమాలో ఆమె చేసిన ముత్తళగు పాత్రతో జాతీయ ఉత్తమ నటిగా ఎంపికవటంతో ఆమె ఆనందానికి అంతేలేదు. నిన్నటి నుంచి కంటిన్యూగా ఫోన్ లు,ఎస్.ఎమ్.ఎస్ లు హడావిడిట. మరో ప్రక్క బొకేలతో శ్రేయాభిలాషుల ప్రసంసలు. దాంతో ఆమె ఇంట్లో పండగ వాతావారణం నెలకొంది. మంగళవారం జాతీయ అవార్డుల్ని ప్రకటించే సమయంలో ఆమె నిద్రపోతోంది. ఆమెకు అవార్డు వచ్చిన సంగతి తెలియాగానే ఆమె తండ్రి ఆమెను నిద్రలేపి విషయం చెప్పారు.

మొదట అపనమ్మకంగా చూసిన ప్రియమణి ఆ తర్వాత ఎగిరి గంతేసింది. తన కుటుంబంతో కలిసి మంగళవారం సరదాగా గడిపింది. అమీర్ దర్శకత్వం వహించిన 'పరుత్తి వీరన్' సినిమాలో ఆమె మేకప్ వేసుకోకుండా ముత్తళుగు పాత్రను సహజంగా పోషించిందనే ప్రశంసలు పొందింది. ఈ సినిమా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శితం కావడం గమనార్హం. బలమైన వ్యక్తిత్వం కలిగిన గ్రామీణ యువతిగా, తను ప్రేమించిన యువకుడి కోసం తల్లిదండ్రుల్ని ఎదిరించే ధైర్యవంతురాలిగా ప్రియమణి ఉన్నత స్థాయి నటనను ప్రదర్శించిందని అందరూ ఆమెను మెచ్చుకున్నారు.

జాతీయ ఉత్తమ నటి అవార్డు రావడంపై స్పందిస్తూ "నాకెంతో సంబరంగా వుంది. ఏం మాట్లాడాలో తెలీనంత ఆనందంగా వుంది. ఇంతకంటే నాకు కావలసింది ఏముంటుంది చెప్పండి. ముత్తళుగు పాత్ర నాకు పేరునీ, కీర్తినీ, అవార్డుల్నీ, గుర్తింపునీ.. అన్నింటికీ మించి బాక్సాఫీసు సక్సెస్‌నీ ఇచ్చింది. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు అమీర్‌కూ, టెక్నీషియన్లకూ చెందుతుంది" అని తెలిపింది. ప్రస్తుతం ఆమె కల్యాణ్‌రామ్ సరసన 'హరే రామ్' సినిమాలో నటిస్తోంది.

ఆమెకు అవార్డు వచ్చిందని తెలియగానే కల్యాణ్‌రామ్ సహా పలువురు యూనిట్ సభ్యులు ఆమెకు ఫోన్‌లో అభినందనలు తెలిపారు. మరో ప్రక్క పరుత్తివీరన్ తెలుగులోకి డబ్ చేస్తే ఎట్లా ఉంటుందని మరికొందరు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ఆ సినిమాని దర్శకుడు సముద్ర హీరోగా చేస్తాడని రైట్స్ తీసుకున్నాడని ప్రచారం జరిగింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X