»   » ప్రియమణితో వెంకటేష్ రొమాన్స్!

ప్రియమణితో వెంకటేష్ రొమాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పటికే విక్టరీ వెంకటేష్ తులసి, లక్ష్మీగా వచ్చి మంచి విజయాలు సాధించుకున్నాడు. సంక్రాంతికి విడుదల అయిన నమో వెంకటేశ చిత్రం విజయ పథంలో నడుస్తున్నది, ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన వెంకీ ఈ సారి మంచి యాక్షన్ అండ్ ఎంటర్ టైనర్ మూవీతో రావాలని అనుకుంటున్నాడు. దానికోసం ఈ సారి పవర్ ఫుల్ డాన్ గెటప్ తో 'గంగా"గా సిధ్దమవుతున్నాడు వెంకీ.

కొరియోగ్రాఫర్ నుండి దర్శకత్వం బాట పట్టి రణం, ఖతర్నాక్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అమ్మ రాజశేఖర్, వెంకటేష్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథను రెడీ చేయడంతో కథ విన్న వెంకీ కూడా సినిమాకు పచ్చజెండా ఊపడంతో..ఆల్ రెడీ లక్ష్మీ మరియు చింతకాయల రవి చిత్రాలకు నిర్మాణ సారధ్యం వహించిన నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాణంలో ఈ చిత్రం ఈ నెలలోనే(ఫిబ్రవరి 15)నుండి షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

మాస్ మసాలాతో వస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన ప్రియమణి నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జగపతిబాబు, ప్రియమణి ల'సాధ్యం" చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నది ఇది పూర్తి అవగానే వేంకటేష్ తో జతకట్టనుందని సమాచారం. ఈ చిత్రానికి సంబందించి పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఓ ప్రముఖ పాత్రలలో ఓ ప్రముఖ హీరో నటిస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం వెంకీకి మంచి విజయాన్ని ఇస్తుందని దర్శకుడు అమ్మ రాజశేఖర్ తెలియజేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu