»   » ప్రియమణి వైపే మొగ్గు చూపుతున్న పవన్ కళ్యాణ్

ప్రియమణి వైపే మొగ్గు చూపుతున్న పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ప్రియమణితో కలిసి ఏ ఒక్క సినిమాలోనూ పని చేయలేదు. ఎందుకో తెలియదు కానీ ఆమెపై తెగ ఆసక్తి చూపుతున్నారట పవన్ కళ్యాణ్. అసలు విషయంలోకి వెళితే... 'గోపాలా గోపాలా' చిత్రంలో స్పెషల్ సాంగు ఎవరితో చేయించాలనే అంశంలో ప్రియమణి అయితే బెటరనే ఆలోచనలో ఉన్నారట.

ఆ మధ్య ప్రియమణి బాలీవుడ్ మూవీ 'చెన్నై ఎక్స్ ప్రెస్'లో చేసిన ఐటం సాంగు పవన్ కళ్యాణ్‌కు తెగ నచ్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంక హిందీ వెర్షన్ 'ఓ మై గాడ్' చిత్రంలో ప్రభుదవా, సోనాక్షి సిన్హా స్పెషల్ సాంగు చేసి అదరగొట్టారు. అదే రేంజిలో తెలుగు వెర్షన్‌లోనూ ఐటం సాంగు ప్లాన్ చేస్తున్నారు.

Priyamani's Special Song in Pawankalyan's Gopala Gopala

'గోపాలా గోపాలా' సినిమా వివరాల్లోకి వెళితే వెంకటేష్, పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 'సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే ఈచిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ భగవంతుడి పాత్రలో కనిపించనున్నాడు. వ్యాపారి పాత్రను వెంకటేష్ చేస్తున్నాడు. వెంకీ సరసన 'శ్రియ' నటిస్తుండగా ప్రధాన పాత్రలలో..మిదున్ చక్రవర్తి, పోసాని కృష్ణ మురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్, పృథ్వి, దీక్షా పంత్, నర్రా శీను, రమేష్ గోపి, అంజు అస్రాని నటిస్తున్నారు.

'గోపాల..గోపాల' చిత్రానికి కథ: భవేష్ మందాలియ, ఉమేష్ శుక్ల, స్క్రీన్ ప్లే: కిషోర్ కుమార్ పార్ధసాని, భూపతి రాజా, దీపక్ రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు : సాయి మాధవ్, సంగీతం : అనూప్ రూబెన్స్, పాటలు : చంద్ర బోస్, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, కొరియో గ్రఫీ : సుచిత్ర చంద్రబోస్, కో డైరెక్టర్స్ : పూసల రాధాకృష్ణ, వై.శ్రీనివాస రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జి క్యుటివ్స్ : వీరేన్ తంబి దొరై, భాస్కర రాజు, అభిరామ్, దర్శకత్వం: డాలి

English summary
After Priyamani’s superhit item number in Chennai Express, she is being roped in for yet another special song in the biggest upcoming multi-starrer. It is Gopala Gopala featuring Venkatesh and Pawan Kalyan in the leads.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu