For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘చారులత’నిరాశపరటంపై ప్రియమణి

  By Srikanya
  |

  హైదరాబాద్ : ''ఈ సినిమా ఫలితం నన్నేమీ నిరాశకు గురిచేయలేదు. నటిగా నాకెంతో సంతృప్తినిచ్చింది. ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలనిపించింది. అయినా ప్రయోగాత్మక చిత్రాల్లో కమర్షియల్ వాల్యూస్ తక్కువగా ఉండటం సహజం. 'చారులత' సినిమా విషయంలో కూడా అదే జరిగింది . అలాగే 'చారులత' చేయకపోతే... నటిగా ఓ గొప్ప పాత్రను మిస్ అయ్యేదాన్ని'' అంటున్నారు ప్రియమణి. ఇటీవల తాను నటించిన 'చారులత' సినిమా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. దాని గురించి ప్రియమణి ఆ విధంగా స్పందించింది.

  'చారులత' అవిభక్త కవలల పాత్రలు చేసినందుకు ఓ నటిగా గర్విస్తున్నానని ప్రియమణి చెప్పారు. తెరమీదే ఇలాంటి అవిభక్త కవలల కథ ఇప్పటివరకు రాలేదు. అందుకే ఓ సవాలుగా ఆ కవలల పాత్రలు స్వీకరించా. వారికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అయితే ఓ అబ్బాయి వారి జీవితంలో వస్తే ఎలాంటి పరిణామాలు సంభవించాయన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకమ్మాయి అమాయకంగా ఉంటే, ఇంకో అమ్మాయి గడుసుగా ఉంటుంది. ఇద్దరి భావోద్వేగాలు వేర్వేరుగా ఉంటాయి. ఒకే సంఘటనకి ఇద్దరూ వేర్వేరుగా స్పందిస్తుంటారు. ఈ పాత్రల్ని చేయడంలో నా బాడీ డబుల్ (డూప్) దీపిక పాత్ర ఎంతో ఉంది. నేనెంత కష్టపడ్డానో, నాతోనే ఉంటూ తనూ అంతే కష్టపడింది అంది.

  అలాగే నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పా. ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్‌కూ, నేపథ్య సంగీతానికీ చాలా ప్రాముఖ్యం ఉంది. కొన్ని సీన్లు ఒళ్లు జలదరింపజేస్తాయి. ఆ సన్నివేశాల్లో సుందర్ సి. బాబు మ్యూజిక్, పన్నీర్ సెల్వన్ సినిమాటోగ్రఫీ ఎంతో కీలకంగా వ్యవహరించాయి. అవార్డుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా చేయలేదు. అవి వస్తే బోనస్‌గా భావిస్తా అంది. చిత్రం కథ విషయానికి వస్తే''పుట్టుకతోనే ప్రియమణిది తన సోదరితో విడదీయలేని బంధం. ఎందుకంటే శరీరాలు కలిసి జన్మించిన అవిభక్త కవలలు వారు. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంపై ప్రేమ అనే అంశం ఎలాంటి ప్రభావాన్ని చూపిందన్నదే అసలు కథ. అందులో ఒకరు విలన్ గా మారి మరొకరి జీవితంతో ఆడుకుంటారు. ఎవరు విలన్, ఎందుకలా నెగిటివ్ గా మారారు అన్నది మిగతా కథ.

  'చారులత' చిత్రంలో ప్రియమణి ఈ కవలల పాత్ర పోషించింది. థాయ్ చిత్రం 'అలోన్' ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందింది. పోన్‌కుమరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల అయ్యింద. ఈ చిత్రంలో ప్రియమణి పాత్రల పేరు 'చారు, లత'. చారు, లతల్లో ఒక యువతి దూకుడు.. మరో యువతి అమాయకురాలు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను ఒకదాని తర్వాత ఒకటి చిత్రీకరించారు. తమిళ చిత్రం 'పరుత్తివీరన్'తో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సాధించారు ప్రియమణి. ఆమెకు మరో జాతీయ అవార్డుని తెచ్చిపెట్టే చిత్రం ఇది అవుతుందనే మీడియాలో ప్రచారం చేసారు.

  English summary
  Priyamani while speaking about Charulatha Failure, “ I am not upset with Charulatha result. because Charulatha film is an experment. My friends are worried about this. I am thankful for their affection on me. That’s all. Don’t make this a big issue.”
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X