»   » ఇంకా అలవాటు పడలేదు.. నా భర్త అలాంటోడు కాదు.. ప్రియమణి

ఇంకా అలవాటు పడలేదు.. నా భర్త అలాంటోడు కాదు.. ప్రియమణి

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  "My Husband Is Not Like That" Priyamani Says నా భర్త అలాంటోడు కాదు..

  దక్షిణాది సినీ తార ప్రియమణి ప్రస్తుతం అందమైన జీవితంలోకి ప్రవేశించింది. ఇటీవల ముస్తాఫా రాజ్ అనే వ్యాపారవేత్తను ప్రియమణి పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. తాజాగా తన భర్త ముస్తాఫా గురించి మాట్లాడుతూ.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపించింది. తన భర్త గురించి పలు విషయాలను ఆమె వెల్లడించారు.

   మా మధ్య ఏదో గాఢమైన బంధం

  మా మధ్య ఏదో గాఢమైన బంధం

  మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. తొలిసారి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సందర్భంగా కలుసుకొన్నాం. ఆ తర్వాత తరచుగా కలుసుకోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత మా మధ్య ఏదో గాఢమైన బంధం ఉంది అనే విషయం అర్థమైంది. పెళ్లి తర్వాత కూడా స్నేహితుల మాదిరిగానే ఉన్నాం. నన్ను చిన్నపిల్లలా చూసుకోవడం నాకు చాలా నచ్చింది.

   అందుకే పెళ్లి నిరాడంబరంగా

  అందుకే పెళ్లి నిరాడంబరంగా

  మా పెళ్లికి ముందు మా ఇంట్లో విషాదం చోటుచేసుకొన్నది. మా బంధువు ఒకరు మరణించారు. అందుకే పెళ్లి చాలా నిరాడంబరంగా జరిగింది. అందుకే ఎక్కువ మందిని పిలువలేదు. త్వరలోనే నా సన్నిహితులను పిలిచి డిన్నర్ ఏర్పాటు చేస్తాం.

   వైవాహిక జీవితానికి

  వైవాహిక జీవితానికి

  మా మధ్య స్నేహం, చొరవ ఉన్నప్పటికీ వైవాహిక జీవితానికి మేము ఇంకా అలవాటు పడలేదు. పెళ్లి జరిగిన మూడో రోజే షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయంలో ముస్తాఫా నన్ను బాగా అర్థం చేసుకొన్నాడు. పెళ్లి తర్వాత ఇంట్లో ఉండాలని చెప్పే వ్యక్తి కాదు నా భర్త. డేటింగ్ చేసేటప్పటి నుంచి నిజాయితీగానే ఉన్నాం.

   జీవితంలో నాకు భర్త ముఖ్యం

  జీవితంలో నాకు భర్త ముఖ్యం

  జీవితంలో నాకు భర్త, అతని కుటుంబ సభ్యులు చాలా ముఖ్యం. నా భర్త, కుటుంబం గురించి ఎవరేమీ అనుకొన్నా పట్టించుకొను. నా భర్త మద్దతు, సహకారం ఉన్నందున పెళ్లయ్యాక కూడా సినిమాలు చేస్తాను

   నెటిజన్లు చాలా కామెంట్స్‌

  నెటిజన్లు చాలా కామెంట్స్‌

  నా భర్త ముస్లీం మతానికి చెందినవాడు. అతడిని వివాహం చేసుకున్నందుకు నెటిజన్లు చాలా కామెంట్స్‌ చేశారు. ముస్తాఫా గురించి, మా ప్రేమ గురించి ముందుగానే మీడియాకు ఎందుకు చెప్పానంటే.. నా సంతోషాన్ని అభిమానులతో పంచుకోవాలనుకొన్నాను. అంతేకానీ ముస్తఫాని పెళ్లి చేసుకోవాలా? వద్దా? అని అనుమతి తీసుకోవడానికి కాదు అని ప్రియమణి అన్నారు.

  English summary
  National Award winner, actor Priya Mani talks about her marriage to businessman Mustufa Raj and how they keep their relationship realistic. I met Mustufa because of Celebrity Cricket League which he is also a part of. It wasn’t love at first sight because we began as friends. But I did notice that he was always protective about me, particularly at the after-parties and ensured that boys didn’t act fresh with me.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more