»   » హీరోయిన్ ప్రియమణి పెళ్లి వేడుక... (ఫోటోస్)

హీరోయిన్ ప్రియమణి పెళ్లి వేడుక... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ ప్రియమణి వివాహం బుధవారం గ్రాండ్‌గా జరిగింది. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్‌ను ఆమె పెళ్లాడారు. బెంగుళూరు శివాజీ నగర్ రిజిస్టర్ ఆఫీసులో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగింది.

ఆగస్టు 24వ తేదీన బెంగుళూరులోని స్టార్ హోటల్‌లో ప్రియమణి-ముస్తఫా రాజ్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగబోతోంది. పెళ్లి ముందు రోజు రాత్రి బెంగుళూరులో గ్రాండ్ గా సంగీత్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు పలువురు కన్నడ స్టార్స్ హాజరయ్యారు.

మతాలు వేర్వేరు కాబట్టే ఇలా

మతాలు వేర్వేరు కాబట్టే ఇలా

ఇద్దరి మతాలు వేర్వేరు కావడం వల్లనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లికి ముందు ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి ఈ విషయమై మాట్లాడారు. తమకు మతాల పట్టింపు లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Priyamani Married With Her Long-Time Boyfriend | Filmibeat Telugu
పెళ్లి తర్వాత సినిమాల్లో

పెళ్లి తర్వాత సినిమాల్లో

పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతానని ప్రియమణి వెల్లడించారు. నటిగా తాను కొనసాగడంలో ముస్తాఫా రాజ్ కు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రియమణి వెల్లడించారు.

పెళ్లైన రెండ్రోజులకే...

పెళ్లైన రెండ్రోజులకే...

పెళ్లైన రెండ్రోజులకే ప్రియమణి మళ్లీ షూటింగులతో బిజీ అయిపోనుంది. ‘పెళ్లైన రెండురోజుల తర్వాత షూటింగుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను, రెండు సినిమాల్లో నటిస్తున్నాను. పెళ్లి కారణంగా షూటింగుకు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు' అని ప్రియమణి తెలిపారు.

ప్రేమాయణం

ప్రేమాయణం

గత ఐదేళ్లుగా ప్రియమణి-ముస్తఫా రాజ్ ప్రేమించుకుంటున్నారు. ముస్తఫా రాజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ఓసారి ఐపీఎల్ మ్యాచ్‌లో ముస్తఫా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

గతేడాది ఎంగేజ్మెంట్

గతేడాది ఎంగేజ్మెంట్

2016 మే 27వ తేదీన ప్రియమణి-ముస్తఫా రాజ్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి కోసం సంవత్సరకంటే ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు. ఈ ఐదేళ్ల పరిచయంలో ఎలాంటి విబేధాలు, మనస్పర్థలు లేకుండా వీరి రిలేషన్ కొనసాగుతుండటం విశేషం.

English summary
Actress Priyamani has tied the knot, with her long-time boyfriend, Mustafa Raj, a businessman, on Wednesday. The tiny gathering of family and friends gathered at the registered office, in Shivajinagar, Bengaluru, to bless the couple. However, there will be a grand reception at a hotel in Bengaluru, tomorrow, August 24th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu