»   » ఇప్పటికైనా కళ్లు తెరచుకున్నా ప్రియమణి!

ఇప్పటికైనా కళ్లు తెరచుకున్నా ప్రియమణి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తారలలో ప్రియమణికి ప్రత్యేక స్థానం ఇస్తున్నారు..ప్రేక్షకులు ఎందుకంటారా? అభినయంతో జాతీయఅవార్డును సొంతం చేసుకుంటే అందంతో అన్ని ఉడ్ లలో అవకాశాలను సొంతం చేసుకుంటుంది.కాబట్టి ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా ఆమెకి అన్నింటా కలిసి ఉండేలా ఒక స్థానాన్ని కల్సిస్తున్నారట. అయితే ఈ మధ్య ప్రియమణికి కూడా ఎదురు దెబ్బలు తగలడం మొదలయ్యాయి. ఎంతకాలం అని ప్రేక్షకులు అందాల్ని చూస్తారు.. ఆ అందం వెనుక కాస్తంత అభినయం ప్రదర్శించాలి..కదా!

రీసెంట్ గా విడుదలైన 'సాధ్యం" చిత్రం ఒక్క ప్రియమణి అందాల కోసమే దర్శకుడు తీసినట్టు అనిపిస్తుంది..ఒకానొక దశలో ఈ చిత్ర నిర్మాత, ప్రియమణిని వేరే రకంగా కూడా వాడుకుని ఉంటాడనిపించేలా. సినిమాలో విప్పేసింది. అంటే ఆశ్చర్యంగా ఉంది కదా? అందుకే ప్రేక్షకులు గుణపాఠం నేర్సాలని చిత్రాన్ని ప్లాప్ చేసి మణికి చిన్న ఝలక్ ఇచ్చారు. దాంతో కళ్లు తెరచుకున్న ప్రియమణి ఇక పై కాస్త నటనకు దానితో పాటుగా అందానికి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటుందని సమాచారం. అన్నట్టు ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం ఒక్క హాలివుడ్ తప్ప అన్ని వుడ్ లలో సినిమాలు నువ్వే కావాలి అన్నట్లుగా ఆవ్వానిస్తున్నాయి..తెలుగులో 'గోలిమార్" తో స్టార్ట్ చేసి బాలీవుడ్ లో 'రావణ్" యొక్క తమిళ 'రక్త చరిత్ర" తో కన్నడ 'ఖుషి" చేసుకుంటుంది..ఈ అందాల సుందరి వీటన్నింటిలో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ సరిలేరు నాకెవ్వరు అంటూ ప్రత్యేక సీటు కోసం పరుగుపెడుతుంది ఈ కవ్వించి కైపెక్కించే వయ్యారాల భామ.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu