»   » రామ్ గోపాల్ వర్మతో భయమేసింది... ప్రియమణి

రామ్ గోపాల్ వర్మతో భయమేసింది... ప్రియమణి

Posted By:
Subscribe to Filmibeat Telugu

రక్త చరిత్రలో చేయాలంటూ పిలుపురాగానే, జీనియస్ రాము గారితో ఎలా ఉంటుందో..ఏమిటో అని మొదట చాలా భయపడ్డాను అని చెప్తోంది ప్రియమణి. రక్త చరిత్రలో తమిళ నటుడు సూర్య సరసన చేస్తున్న ప్రియమణి తాజాగా మీడియాని కలిసి మాట్లాడింది. ముంబయి వెళ్ళి షూటింగ్ లో పాల్గొనేదాకా తాను సంకోచపడ్డానని అని చెప్పింది. అయితే అక్కడకి వెళ్ళాక తన అభిప్రాయాలన్నీ పూర్తిగా మారిపోయాయని చాలా కంపర్ట్ గా ఆ పాత్రను చేసానని చెప్తోంది. అలాగే రామ్ గోపాల్ వర్మ షాట్ తీసేముందు ఆర్టిస్టులతో ఎలా చేద్దామంటూ డిస్కస్ చేసేవారంటూ దాంతో తాము ప్రీగా అనిపించి ఆయన ఆలోచనలకు తగ్గట్లుగా పండించటానికి కృషి చేసేవారమని చెప్తోంది.

ఇక రామ్ గోపాల్ వర్మ...ప్రియమణి నటించిన నేషనల్ అవార్డ్ విన్నర్ సినిమా పరుత్తి వీరన్ చూసి ఆమెను పిలిచారు. రక్త చరిత్రంలో ఆమె గంగుల భానుమతి(మద్దెల చెరువు సూరి భార్య) పాత్రను చేస్తోంది. ఆమె తో కొన్ని సన్నివేశాలను ముంబయి లోని జైలు వద్ద చిత్రీకరించారు. ఇక ఈ చిత్రంలో వివేక్ ఒబరాయ్...పరిటాల రవిగా చేస్తున్నారు. అలాగే శతృఘ్నసింహా ఎన్టీఆర్ గానూ,రాధా ఆప్టే పరిటాల సునీతగానూ కనిపించనున్నారు. రెండు పార్టులుగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు వర్మ. మొదటి పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. రెండవ పార్ట్ షూటింగ్ జరుగుతోంది. తమిళ, హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రం ఒకేసారి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu