»   » స్టార్ హీరో కోసం ప్రియమణి ఫ్రీగా...!

స్టార్ హీరో కోసం ప్రియమణి ఫ్రీగా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మణిరత్నం, అభిషేక్, ఐశ్వర్యల కాంబినేషన్లో వచ్చిన రావన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ప్రియమణి తర్వాత ఆర్‌జివి రక్త చరిత్రతో నటించినా ఆశించిన పేరు దక్కలేదు. తర్వాత బాలీవుడ్ ఆఫర్లు అంతగా రాకపోవడంతో సౌత్ కే ఫిక్స్ అయిపోయింది.

చాలా కాలం తర్వాత షారుక్ హీరోగా రూపొందిన బాలీవుడ్ మూవీ 'చెన్నై ఎక్స్ ప్రెస్' లో ప్రియమణికి ఐటం సాంగు చేసే అవకాశం దక్కింది. గతంలో షారుక్ చేసిన 'చయ్య చయ్య సాంగ్' మాదిరి ఈ పాట కూడా సాగుతుంది. ఈ పాటకు అసలు ప్రియమణి పారితోషికమే తీసుకోలేదట.

ప్రియమణి ఫ్రీగా చేయడం వెనక పెద్ద ప్లానే ఉందని, ఈ చిత్రంలో తన ఐటం సాంగుకు మంచి పేరొస్తే మరిన్ని బాలీవుడ్ వస్తాయనే ఆలోచనతో ఉందని, అవకాశాలు వస్తే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుందనే సూత్రాన్ని ప్రియమణి ఫాలో అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్.

షారుక్ ఖాన్‌, దీపిక పడుకొనె హీరో హీరోయిన్లుగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో 'చెన్నై ఎక్స్‌ప్రెస్' తెరకెక్కింది. ఆగస్టు 8న విడుదలకు సిద్ధమైన ఈచిత్రం ట్రైలర్ ఇటీవల విడుదల చేసారు. ముంబై నుంచి రామేశ్వరం వరకు ప్రయాణం చేసిన చిత్ర కథానాయకుడికి ఎదురైన అనుభవాలతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

కాగా...తాజాగా విడుదలైన ఈచిత్రం ట్రైలర్ చూస్తుంటే పలు దక్షిణాది చిత్రాలతో పాటు, తెలుగు సినిమాలైన ఒక్కడు, నరసింహ నాయుడు, అంత:పురం, మర్యాద రామన్న లాంటి చిత్రాల్లోని సీన్లను దర్శకుడు రోహిత్ కాపీ కొట్టాడని స్పష్టం అవుతోంది. ఆ సీన్లన్నీ దక్షిణాది సినిమాల్లో బాగా పాపులర్ అయినవే.

English summary
Priyamani re-entered Bollywood with an item number in superstar Shahrukh Khan's forthcoming flick Chennai Express. The actress shook her legs with Shahrukh Khan along with group dancersh. Priyamani, who was very excited to work with the King Khan for the first time, completely enjoyed her latest assignment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu