»   » వండర్ వుమెన్ ని కూడా దాటేసింది: ప్రియాంకా చోప్రా వరల్డ్ టాప్

వండర్ వుమెన్ ని కూడా దాటేసింది: ప్రియాంకా చోప్రా వరల్డ్ టాప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ స్టార్‌ డ్వెయిన్‌ జాన్సన్‌తో కలిసి 'బేవాచ్‌' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మ‌రోవైపు అమెరిక‌న్ టీవీ సీరియ‌ల్‌ 'క్వాంటికో'లోనూ అద‌ర‌గొట్టిన ఈ అమ్మ‌డికి ఎంతో క్రేజ్ వ‌చ్చేసింది.బాలీవుడ్ గ్లామర్ గాళ్ ప్రియాంక చోప్రా నటించిన తొలి హాలీవుడ్ సినిమా "బేవాచ్". ఈ సినిమా భారతదేశం లో విడుదలకబోతున్న సందర్బంగా ఈ నిర్మిస్తున్న పారామౌంట్ ఫిలిమ్స్ సంస్థ న్యూయార్క్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించడంతో.. విడుదలకు ముందుగానే ఈ సినిమా రివ్యూలు బయటకు వచ్చేసాయి.

విక్టోరియా లీడ్స్‌

విక్టోరియా లీడ్స్‌

ఈ సినిమాలో ప్రియాంక చోప్రా విక్టోరియా లీడ్స్‌ పాత్రలో ఓ విలన్ గా కనిపిస్తుండగా.. డ్వెయిన్‌ జాన్సన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో డ్వెయిన్‌ జాన్సన్‌ తో పాటు ఇతర గొప్ప హాలీవుడ్‌ నటులున్నా కూడా ప్రియాంకా చోప్రా నటనే సినిమాలో హైలైట్ గా ఉందంటున్నారు. ప్రియాంక పాత్రనే సినిమాకు అసలైన బలమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

అందరినీ మించిపోయి మరీ

అందరినీ మించిపోయి మరీ

అయితే ఇప్పటికి తాజా న్యూస్ ఏమిటంటే తన కోస్టార్స్ అందరినీ మించిపోయి మరీ ప్రియాంకా క్రేజ్ ని సంపాదించింది. సోష‌ల్ మీడియా సైట్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్స్ ప్లస్ వంటి వాటిల్లో మోస్ట్ పాప్యులర్ ర్యాంకింగ్ లో ఆమె అగ్ర‌స్థానంలో నిలిచింది.

ఎంవీ పిండిక్స్

ఎంవీ పిండిక్స్

సోషల్ మీడియా ఎనలిటిక్స్ కంపెనీ ఎంవీ పిండిక్స్ తాజాగా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్స్ ప్లస్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో మోస్ట్ పాపులర్ ర్యాంకింగ్ యాక్టర్ల లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో మొదటి ప్లేస్‌లో ప్రియాంక, డ్వానే జాన్సన్ సెకండ్ ప్లేస్, యాక్టర్, కమెడియన్ కెవిన్ హర్ట్ మూడో ప్లేస్‌లో నిలిచారు.

వండర్ వుమెన్ నాలుగో ప్లేస్

వండర్ వుమెన్ నాలుగో ప్లేస్

వండర్ వుమెన్ స్టార్ గాల్ గాఢట్ నాలుగో ప్లేస్, కారా డెలివింగ్నే ఐదో ప్లేస్‌లో నిలిచారు. తర్వాత స్థానాల్లో విన్ డీజిల్, జెన్నిఫర్ లోపేజ్, అస్లే బెన్సన్, జాక్ ఎఫ్రాన్ ఉన్నారు. అదీ మరి సంగతి మొత్తానికి మన మేడమ్ హాలీవుడ్ లో గట్టిగానే జండా పాతేస్తోందన్న మాట.

English summary
Priyanka beats Dwayne Johnson, Gal Gadot to become most popular actor on social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu