twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్యాబరే డాన్సర్‌గా...రామ్ చరణ్ హీరోయిన్

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్ చరణ్ సరసన జంజీర్ చిత్రం చేస్తున్న ప్రియాంక చోప్రాది మొదటి నుంచీ విభిన్నమైన దారి. తానేం చేసినా అందరూ ప్రత్యేకంగా గుర్తించాలనే టైపు. తాను చేసిన పనులు తన తర్వాతివారు చేస్తూ ఆ గుర్తింపుకు మరింత రాణింపు తేవాలని ప్రియాంక కోరుకుంటుంది. ఆమె తాజాగా క్యాబరే డాన్సర్ గా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

    'షూటవుట్ యట్ వాథాలా' చిత్రంలో బబ్లీ బద్మాష్ ఐటెమ్ పాటకు ఆమె చేసిన నృత్యాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఊపుతో మరోసారి క్యాబరే డాన్సర్‌గా ఐటెమ్ సాంగ్ చేయడటానికి ఒప్పుకుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న 'గన్ డే' చిత్రంలో క్యాబరే డాన్సర్‌గా ప్రియాంక నటిస్తోంది. రణవీర్‌సింగ్, అర్జున్ కపూర్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం 90ల కాలంలోని మాఫియా నేపథ్య కథతో తెరకెక్కుతోంది. కలకత్తా నేపధ్యంలో చిత్రం తెరకెక్కుతంది.

    ఓ పక్క 'బర్ఫీ' లాంటి చిత్రాలు చేస్తూ మరోపక్క 'జంజీర్'లాంటి మాస్ మసాలా చిత్రాలు కూడా ఒప్పుకుంటూ, ఐటెమ్ సాంగ్‌లకు కూడా సై అంటోంది. ఈ చిత్రం చేశాక ప్రియాంక ఎలాంటి చిత్రాలకు మళ్లీ డేట్స్ ఇస్తుందో చూడాల్సిందే అంటున్నారు బాలీవుడ్ వాసులు. ఇక రామ్ చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' . ఈ చిత్రం ఎవరూ ఊహించని రేంజిలో రికార్డు స్థాయి రేటుకు అమ్ముడు పోయింది. ఈచిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ రూ. 105 కోట్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    రామ్ చరణ్‌ సినిమాలకు తెలుగులో దాదాపు రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసే స్టామినా ఉండటం, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉండటంతో పాటు, హిందీ మార్కెట్లో 'జంజీర్' చిత్రం అవలీలగా 80 కోట్లపైగానే వసూలు చేసే అవకాశం ఉండటంతో వంద కోట్లకు పైగా భారీ మొత్తానికి వెచ్చింది జంజీర్ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో జంజీర్ చిత్రాన్ని 'తుఫాన్' పేరుతో, మళయాలంలో 'ముంబై కా హీరో' పేరుతో విడుదల చేస్తున్నారు.

    English summary
    Priyanka Chopra will be seen doing a cabaret for her next film Gunday. She will be dressed in sequined outfit topped by a feather boa and will do a la Helen.Gunday is set in Calcutta in the ’70s. While researching for the film director Ali Abbas Zafar discovered that there were two different social strata in the city — one which was the underprivileged and the others were the elite who would enjoy cabaret performances. International troupes would perform in the city. Abbas decided to highlight that in his film and brought in a troupe from Paris to be part of Gunday. A set of ’70s style club in Calcutta (now Kolkata) was created for the song.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X