»   » మీడియాపై మండిపడ్డ రామ్ చరణ్ హీరోయిన్

మీడియాపై మండిపడ్డ రామ్ చరణ్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న జంజీర్ రీమేక్ లో హీరోయిన్ గా చేస్తున్న బాలీవుడ్ బ్యాటీ ప్రియాంకచోప్రా..తనకు ఇష్టం లేని వార్తలు రాశారంటూ మీడియాపై చిందులేస్తోంది. సంజయ్ లీలా బన్సాలీ నిర్మిస్తున్న 'రామ్‌లీలా' సినిమాలో తాను 'ఐటెం సాంగ్' చేస్తున్నట్లు వినిపిస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ....నిరాధారమైన వార్తలు నన్ను అప్ సెట్ చేశాయి. ఓ నటిని తొలగించారు. మరో నటి ఈ చిత్రంలో నటిస్తోంది అని మీడియాలో వచ్చే వార్తలు ఇబ్బంది కలిగిస్తాయి. స్పష్టత లేకపోతే రాయకూడదు అని మీడియాకు సూచించింది. రామ్ లీలా చిత్రంలో దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారత బాక్సర్ మేరి కోమ్ జీవిత కథ అధారంగా భన్సాలీ నిర్మిస్తున్న ప్రియాంక నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే తనకు వరుసగా హీరోయిన్ పాత్రల్నే చేస్తున్న తనకు ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయని, ఇక 'ఐటెం సాంగ్'ల కోసం వెంపర్లాడాల్సిన అగత్యం తనకు లేదంటోంది. 'రామ్‌లీలా'లో 'ఐటెం సాంగ్' చేయాలంటూ నిర్మాతలు మొదట ఐశ్వర్యా బచ్చన్‌ను అడిగారని, ఆమె సమ్మతించక పోవడంతో ప్రియాంక ఒప్పుకుందని బాలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. ఈ సందర్భంగా ఆమె ఇలా స్పందించింది.

అంతర్జాతీయ మహిళా బాక్సర్ మేరీ కామ్ జీవితకథ ఆధారంగా బన్సాలీ నిర్మిస్తున్న సినిమాతో తాను బిజీగా ఉన్నానని, ఎవరి చిత్రంలోనూ 'ఐటెం సాంగ్'లో నటించడం లేదని ప్రియాంక చెబుతోంది. ఫలానా సినిమా నుంచి తనను తొలగించారని, ఎవరికో అవకాశం ఇచ్చారని ఆధారం లేని వార్తలను ప్రచారం చేయడం మీడియాకు తగదని ఆమె సలహా ఇస్తోంది.

తనకు ఎలాంటి ప్రచారం అవసరం లేదని, సంచలనాల కోసం కట్టుకథలను మీడియా సృష్టించడం మంచిది కాదంటోంది. సరైన నిర్థారణ లేకుండా ఆధారాల్లేని వార్తలను సృష్టించడం వల్ల మీడియాకు తప్ప ఎవరికీ ప్రయోజనం ఉండదని ఆమె వ్యాఖ్యానిస్తోంది. బన్సాలీ నిర్మిస్తున్న 'రామ్‌లీలా'లో రణ్‌బీర్ సింగ్, దీపికా పడుకునె ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ఆ సినిమాలో 'ఐటెం సాంగ్' కోసం తాను ఎందుకు ప్రయత్నిస్తానని ఆమె ప్రశ్నిస్తోంది.

English summary
Priyanka Chopra maintained good relations with media all these years, be it for her films, music videos, link-ups, promotions or even appearances at global events. She too had lost her cool during a recent media interaction as there is too much negative publicity going on about her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu