»   » అమెరికా నన్ను అసహ్యించుకోవడం ఖాయం : ప్రియాంక చోప్రా (న్యూ ఫోటో షూట్)

అమెరికా నన్ను అసహ్యించుకోవడం ఖాయం : ప్రియాంక చోప్రా (న్యూ ఫోటో షూట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఫిల్మ్ ఫేర్ మేగజైన్ అక్టోబర్ సంచిక కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కొత్త ఫోటో షూట్ ఇండస్ట్రీ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రియాంక స్టైల్ స్టేట్మెంట్ విషయంలో చాలా మార్పు వచ్చిందని, గతంలో కంటే మరింత అందంగా, సెక్సీగా ఆకట్టుకుంటోందని అంటున్నారంతా.

ప్రస్తుత సినీ జగత్తులో ఎంత పెద్ద హీరోయిన్ అయినా లైమ్ లైట్ లో ఉండాలంటే ప్రముఖ మేజగజైన్లపై అందాలు ఆరబోస్తూ హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లలో పాల్గొనడం కూడా తప్పనిసరైంది. బాలీవుడ్‌లోకి ప్రవేశించి 13 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌ హోదాలోనే కొనసాగుతోంది.


ఇప్పటి ట్రెండును ఫాలో అవుతూ, కొత్త హీరోయిన్లతో అందం పరంగా, టాలెంట్ పరంగా పోటీ పడటం వల్లనే ప్రియాంక చోప్రా ఇంకా తన హవా కొనసాగిస్తోంది. ఫిల్మ్ ఫేర్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు చూస్తూ ఆమె సినిమాల విశేషాలపై ఓ లుక్కేద్దాం.

బేవాచ్ అనే హాలీవుడ్ మూవీలో

బేవాచ్ అనే హాలీవుడ్ మూవీలో

ప్రియాంక చోప్రా ప్రస్తుతం బేవాచ్ అనే హాలీవుడ్ ఫిల్మ్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ద్వేడ్ జాన్సన్(ది రాక్) హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆమె అందాల ఆరబోతతో పాటు విలనిజం ప్రదర్శించబోతోంది.

అమెరికా నన్ను అసహ్యించుకోవడం ఖాయం

అమెరికా నన్ను అసహ్యించుకోవడం ఖాయం

ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి ప్రియాంక చోప్రా కొన్ని సీక్రెట్స్ పంచుకుంది. ఆ హాలీవుడ్‌ ఫిల్మ్‌లో తన పాత్ర క్రూరంగా ఉంటోంద‌ని ఆమె పేర్కొంది. తానో రాక్ష‌సిన‌ని, అమెరికా త‌న‌ను అస‌హ్యించుకోవ‌డం ఖాయ‌మ‌ని బాలీవుడ్ స్టార్ అభిప్రాయ‌ప‌డింది.

ఎమ్మీ అవార్డ్స్ సందర్భంగా

ఎమ్మీ అవార్డ్స్ సందర్భంగా

ఎమ్మీ అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్రియాంక ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన కామెంట్స్ చేసాు. హాలీవుడ్ హీరో డ్వెయిన్ జాన్స‌న్‌తో బేవాచ్‌లో న‌టిస్తున్న ప్రియాంక ఆ ఫిల్మ్‌కు సంబంధించిన కొన్ని వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

అప్పటి టీవీ సిరీసే ఇపుడు సినిమా

అప్పటి టీవీ సిరీసే ఇపుడు సినిమా

90వ ద‌శకంలో చాలా పాపుల‌రైన బేవాచ్ టీవీ సీరియ‌ల్ ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నారు. దాంట్లో ప్రియాంక విల‌న్ పాత్ర‌ను పోషిస్తుంది. విక్టోరియా లీడ్స్ క్యారెక్ట‌ర్‌తో తాను ఓ క‌ర్క‌శ‌మైన‌ అమ్మాయిలా క‌నిపిస్తాన‌ని ప్రియాంక చెప్పింది.

క్వాంటికో

క్వాంటికో

దీంతో పాటు అమెరికా టీవీ సిరీస్ క్వాంటికోలోనూ న‌టిస్టున్న ఆమె ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని విష‌యాల‌ను కూడా వెల్ల‌డించింది. ఆ సిరీయ‌ల్ తొలి ఎపిసోడ్‌ను చూశాన‌ని, అది టీవీ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డింది.

ఆమె గురించి

ఆమె గురించి

ప్రియాంక చోప్రా 1982వ సంవత్సరం జూలై 18వ తేదీన జన్మించింది. మోడలింగ్ పై ఆసక్తితో అటు వైపు అడుగులు వేసిన ప్రియాంక...ఆ తర్వాత ప్రపంచ సుందరి పోటీల వైపు ఆకర్షితురాలైంది.

చిన్నతనంలో

చిన్నతనంలో

అశోక్ చోప్రా, మధు అఖౌరి వైద్య దంపతులకు జార్ఖండ్‌లోని జమ్‌షెడ్‌పూర్‌లో ప్రియాంక చోప్రా జన్మించింది. చోప్రా తన బాల్యాన్ని ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలిలో, మస్సాచుసెట్ట్స్‌లోని న్యూటన్ ప్రాంతంలో మరియు ఐవాలోని సెదర్ రాపిడ్స్ ప్రాంతంలో గడిపింది. ఆమె తండ్రి సైన్యంలో వైద్యుడు కావటం వలన వారు తరచుగా ప్రాంతాలు మారుతూ ఉండేవారు. ఆమె తండ్రి బరేలీలో స్థిరపడిన పంజాబ్‌కు చెందిన ఖత్రి కుటుంబానికి చెందినవాడు మరియు ఆమె తల్లి జమ్‌షెడ్‌పూర్‌లో స్థిరపడిన మలయాళీ కుటుంబానికి చెందినది. ఆమెకు ఆమెకంటే ఏడు సంవత్సరాలు చిన్నవాడైన సిద్ధార్థ్ అనే తమ్ముడు ఉన్నాడు.

మిస్ వరల్డ్

మిస్ వరల్డ్

2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. అంతకు ముందు కొంతకాలం పాటు ఆమె మోడలింగ్ రంగంలో శిక్షణ తీసుకున్నారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఐదవ భారతీయ మహిళగా మరియు ఏడు సంవత్సరాల కాలంలో కిరీటం దక్కించుకున్న నాల్గవ మహిళగా చోప్రా ప్రసిద్ధి గాంచింది.

సినిమాల్లోకి

సినిమాల్లోకి

తమిళంలో 2002 సంవత్సరంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రంతో ప్రియాంక చోప్రా తన నట జీవితం ప్రారంభించింది. అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై' (2003) ద్వారా ఆమె బాలీవుడ్ రంగప్రవేశం చేసింది కానీ అదే సంవత్సరంలో రాజ్ కన్వర్ దర్శకత్వంలో వచ్చిన అందాజ్ చిత్రం ద్వారా ఆమెకు పరిశ్రమలో తొలి విజయం లభించింది.

English summary
Priyanka Chopra is all out there- on screen, on covers and everywhere; another proof to that is her gracing the cover of the annual edition of Filmfare Magazine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu