»   » ప్రియాంకచోప్రా లక్కీ ఛాన్స్..87 దేశాల్లో ప్రచారం

ప్రియాంకచోప్రా లక్కీ ఛాన్స్..87 దేశాల్లో ప్రచారం

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి, ప్రియాంక చోప్రా ఒక అంతర్జాతీయ దుస్తుల కంపెనీకి ప్రచార కర్తగా ఎంపిక అయ్యింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ దుస్తుల కంపెనీ 'గెస్‌' ఈ సంవత్సరం తమ దుస్తుల ప్రచారకర్తగా ప్రియాంకా చోప్రాను ఎంచుకుంది. 30 సంవత్సరాల ఈ ఫ్యాషన్‌ దుస్తుల కంపెనీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆ వస్త్రాలను ధరించి ప్రచారాన్ని చేసే అదృష్టాన్ని సొంతం చేసుకున్న భారతీయ సుందరి ప్రియాంకానే.

  గెస్‌కంపెనీ తయారు చేసిన దుస్తులను ధరించి ప్రపంచవ్యాప్తంగా 87 దేశాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నదీ బాలీవుడ్‌ భామ. ఈమెను మొట్టమొదటిసారి చూసినప్పుడే ఆమెలోని ఆత్మవిశ్వాసం, వర్ఛస్సు తనను కట్టి పడవేశాయని, యవ్వనంలో ఉన్నప్పటి సోఫియా లారెన్‌ను ప్రియాంకా గుర్తుకు తెచ్చిందంటున్నారు గెస్‌ సంస్ధ సీఈఓ-సహ స్థాపకుడు మార్‌సీయానో. ఆయా దేశాల్లో ప్రచారం కోసం ప్రియాంకాతో ఫోటో షూట్‌ను కెనడాకు చెందిన ప్రముఖ గాయకుడు, ఛాయా చిత్రగ్రాహకుడు బ్రాన్‌ ఆడమ్స్‌ నలుపు-తెలుపుల్లో తన కెమెరాతో ఒడిసిపట్టాడు.

  Priyanka Chopra

  తనకు ఈ అపూర్వ గౌరవం దక్కడంపట్ల ప్రియాంక చోప్రా ఎంతో సంతోషంగా ఉంది. కంపెనీ రూపొందించిన పలు రకాల డ్రెస్‌లు, షర్టులు, షూలు ధరించి ప్రచారంలో పాలుపంచుకోబోతోంది ప్రియాంకా. పురాతన హాలీవుడ్‌ హీరోయిన్ల రూపాన్ని పోలి ఉంది ఫోటో షూట్లలో ప్రియాంకా వస్త్రధారణ, అలంకరణ.

  ఇంతకు క్రితం ప్రముఖ అంతర్జాతీయ సూపర్‌ మోడళ్ళు క్లౌడియా షిపర్‌, కార్లా బ్రూనీ, ఇవా హెర్జిగోవా, ఆడ్రియానా లిమా, అలిసాండ్రా అంబ్రోసియో, కెటీ అప్టన్‌, నటి డ్రూ బెర్రిమోర్‌ వంటి వారు ఈ గెస్‌ కంపెనీకి ప్రచారకర్తలుగా వ్యవహరించారు.

  English summary
  Priyanka Chopra is the first Bollywood actor to become the face of global fashion brand GUESS, and the actor considers it a big deal. “Being a GUESS girl for me is a really big deal because the most iconic beautiful women have been part of these campaigns. It’s one of the most iconic brands in the world,” the 31-year-old said at a GUESS store where she was unveiled as the new GUESS girl. “When I went to New York this time, to pick up the magazines and saw Julia Roberts in the front and myself on the back, I was like ‘woah’,” she added.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more