»   » మ్యాగ్జిమం చూపించేసింది.... మ్యాగ్జిం కవర్ పేజీ మీద ప్రియాంకా చోప్రా

మ్యాగ్జిమం చూపించేసింది.... మ్యాగ్జిం కవర్ పేజీ మీద ప్రియాంకా చోప్రా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా హాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అందాల నటి ప్రియాంక చోప్రా హాలీ వుడ్ క్వాంటికో ద్వారా బాగానే పాపులర్ అయ్యింది. ప్రియాంక తాజాగా "బే వాచ్" అనే హాలీవుడ్ సినిమాలో చేస్తోంది. ప్రియాంక చోప్రాలో ఓ గొప్ప టాలెంట్ ఉంది. గ్లామర్‌ని చూపించి చూపించనట్టు ఉండే ప్రియాంక అందాల్ని ఏ మేరకు అరబోయాలో బాగానే తెలుసుకున్నట్టుంది.

priyanka

ఇప్పటికే ఎన్నో సార్లు ఈ భామ ఈ అందాల ప్రదర్శనలు చేస్తూ అందరి ప్రసంశలు అందుకుంది. ముఖ్యంగా కుర్రకారు గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ మధ్య లేటెస్ట్‌గా మరో సారి మ్యాగ్జిమ్ కవర్ పేజీపై బోల్డ్ పోజిచ్చింది. గురువారం జరిగిన ఈ కవర్ పేజీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ప్రియాంక తన స్టన్నింగ్ లుక్ తో అదరగొట్టింది. మోనిషా జైసింగ్ రూపొందించిన నేవి బ్లూ గౌన్ లో ఈ వేడుకకు వచ్చిన ఆమె ఈ సందర్భంగా తన హాలీవుడ్ తొలి చిత్రం 'బేవాచ్' విశేషాలు చెప్పింది.

priyanka

"బాజీరావు మస్తానీ"లో తన సహనటి అయిన దీపికా పదుకొణేతో వివాదం అంటూ వినిపించ్న వార్తల సంగతి ప్రస్తావించినప్పుడు. దీపికా తో తన "ఈక్వెషన్స్" బాగానే ఉన్నాయని, తాము ఇప్పటికీ మంచి స్నేహితులమేనని బదులిచ్చింది.. అయితే హలీవుడ్ లో తనకన్నా దీపికకు మంచి ఆఫర్లు వస్తుండటంపై మాత్రం స్పందించడానికి నిరాకరించింది.

priyanka

ఒకరికి వస్తున్న ఆఫర్ల గురించి నేనెందుకు స్పందించాలి? ఆ అవసరం నాకు లేదంటూ ప్రియాంక తోసిపుచ్చింది. కాగా, మాగ్జిమ్ కవర్ పై ప్రియాంక బోల్డ్ పోజు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

English summary
Priyanka Chopra unveils the controversial mag cover, talks about Quantico, Baywatch and Deepika..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu