»   » మేరీ కోమ్ ఇంట్లో ప్రత్యక్షమైన ప్రియాంక (ఫోటోలు)

మేరీ కోమ్ ఇంట్లో ప్రత్యక్షమైన ప్రియాంక (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : కల్పిత పాత్రలకంటే నిజజీవిత పాత్రలు పోషించడానికే నేటి తారలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వైనాన్ని ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం. బాలీవుడ్ అందాల తార ప్రియాంకా చోప్రా కూడా త్వరలో అలాంటి పాత్ర వెండితెరపై పోషించబోతోంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ఒలింపిక్స్ లో పాల్గొని, బాక్సింగు క్రీడలో కాంస్య పతకాన్ని సాధించిన మణిపూర్ మణిపూస మేరీ కోమ్ పాత్రను ఇప్పుడు ప్రియాంకా పోషించబోతోంది.

బాక్సర్ గా ఎదిగే క్రమంలో మేరీ కోమ్ తన జీవితంలో ఎదుర్కున్న అనుభవాల నేపథ్యంలో సంజయ్ లీలాభన్సాలీ రూపొందిస్తున్న ఈ హిందీ చిత్రం షూటింగు జనవరి నుంచి మొదలవుతుంది. మేరీ జీవితం తననెంతో ఇన్స్ పైర్ చేసిందని, అందుకే ఈ పాత్ర చేయడానికి మరో ఆలోచన లేకుండా అంగీకరించాననీ ప్రియాంకా చెబుతోంది. ఒమంగ్‌ కుమార్‌ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మేరీ కోమ్ జీవితంలోని అనుభవాలను స్వయంగా దగ్గరుండి తెలుసుకోవడానికి ప్రియాంక చోప్రా ఇటీవల ఇంపాల్‌లోని మేరీకామ్ ఇంటికెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు, మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

మేరీ కోమ్ భర్త, పిల్లలతో కలిసి ప్రియాంక చోప్రా ఇలా ఫోటోలకు ఫోజు ఇచ్చింది. మేరీ కోమ్ జీవితం గురించిన సినిమా కావడంతో ఆమె నడవడికను, అలవాట్లను దగ్గరుండి తెలుసుకుంటోంది ప్రియాంక. అంతే కాకుండా బాక్సింగులో మెళకువలను కూడా నేర్చుకుంటోంది.

అయితే మేరీ కోమ్‌ పాత్రను పోషించడం ఎంత కష్టమో ఆమెకు అర్థమైంది. ఒక సన్నివేశం పూర్తి చేసేసరికి ప్రియాంకకి చేతులు నొప్పిపుడుతున్నాయి. బాక్సింగ్ అనేది చాలా కష్టంతో కూడుకున్న క్రీడ కావడంతో ప్రత్యేకంగా ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటోంది.

మేరీకోమ్ నిజ జీవితం నుంచి స్ఫూర్తి పొందిన దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. ఈ చిత్రంలో బాక్సింగ్ కోచ్‌గా మేరీకోమ్ అతిథి పాత్రను పోషించబోతోంది. మేరీకోమ్ జీవితంలోని భిన్న పార్శాల్ని తెలుసుకోవడానికే కొన్ని రోజుల పాటు మణిపూర్‌లో వుండాలని నిర్ణయించుకున్నట్లు ప్రియాంక చోప్రా తెలిపింది.

మేరీ కోమ్ పాత్రను పోషించడం ప్రియాంక తన కెరీర్లో చాలెంజింగ్‌గా తీసుకుంటోంది. ఇందు కోసం చాలా కష్ట పడుతోంది. ఆమె కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ప్రియాంక సన్నిహితులు అంటున్నారు.

English summary
Priyanka Chopra, who will be soon in a biopic, recently visited Imphal to meet boxer Mary Kom. Priyanka, who has already started her training session to fit into the shoes of the ace boxer, visited Kom's hometown Imphal to get first hand information on her life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu