»   » ప్రియాంకకు నయనతార షాక్.. రేర్ కాంబినేషన్ ఇది..

ప్రియాంకకు నయనతార షాక్.. రేర్ కాంబినేషన్ ఇది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న ప్రియాంక చోప్రా, దక్షిణాదిలో హవా కొనసాగిస్తున్న నయనతార ఇద్దరు అమెరికాలో కలుసుకోవడం జరిగింది. ఇటీవల అమెరికాలో పలు కార్యక్రమాల్లో బిజీబిజీగా కాలం గడుపుతున్నారు. ఇటీవల ది పవర్ ఆఫ్ విమెన్ అనే గౌరవాన్ని ప్రియాంక అందుకోవడం ద్వారా ఆక్టావియా స్పెన్సర్, ప్యాటీ జెన్‌కిన్స్, కెల్లీ క్లార్క్సన్, మిచెల్లీ పెఫియర్ లాంటి అగ్ర హాలీవుడ్ తారల సరసన చేరారు. ఇదే సమయంలో నయనతార తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో అమెరికా వెకేషన్‌లో ఉన్నారు.

అయితే ఈ ఇద్దరు అగ్రతారలు అమెరికాలో అనుకోకుండా కలుసుకొన్నారు. నయనతారను చూసిన ప్రియాంక చోప్రా సాదరంగా ఆహ్వానించారట. నల్లటి డ్రెస్‌లో ఉన్న ప్రియాంక, బ్లూ డెనిమ్ దుస్తులు ధరించిన నయనతార ఫొటోకు ఫోజిచ్చారు. ప్రస్తుతం నయనతార తమిళ, తెలుగు భాషల్లో కలిపి దాదాపు ఐదు చిత్రాల్లో నటిస్తున్నది.

English summary
Priyanka Chopra met famous South Indian actress Nayanthara in the US. PeeCee was dressed in black, Nayanthara opted for a blue denim dungaree with a yellow tee shirt. Both the girls had warm smiles. Nayanthara is awaiting the release of Aramm in Diwali and has four to five projects in the pipeline.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu