»   » న్యూ ఇయర్ నైట్ : చరణ్ హీరోయిన్‌కు 7 నిమిషాలకు 7 కోట్లు!

న్యూ ఇయర్ నైట్ : చరణ్ హీరోయిన్‌కు 7 నిమిషాలకు 7 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: న్యూ ఇయర్ వేడుక వస్తుందంటే చాలు సినిమా హీరోయిన్లకు, ఐటం గర్ల్స్‌కు డిమాండే డిమాండ్. సాధారణంగా నెలల తరబడి కష్టపడితే వచ్చేంత డబ్బు....కేవలం ఈ ఒక్క రాత్రిలోనే సంపాదిస్తుంటారు తారలు. బాలీవుడ్ సెలబ్రిటీలైన ప్రియాంక చోప్రా, అమీషా పటేల్, రాఖీ సావంత్, యోయో హనీ సింగ్, మికాసింగ్ తదితరులకు న్యూఇయర్ వేడుకల పుణ్యమా అని కోట్లాది రూపాయల ఆఫర్లు వచ్చాయి.

priyanka-honey-mika-rakhi

రామ్ చరణ్ సరసన 'తుఫాన్' చిత్రంలో నటించిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.... చెన్నైలోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో 7 నిమిషాల పెర్పార్మెన్స్ ఇచ్చేందుకు రూ. 7 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే విషయమై ఆమెను పశ్నిస్తే....వినోదం పంచడం నా వృత్తి, అందుకే ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను అని ఆమె చెప్పింది. రెమ్యూనరేషన్ విషయంపై మాత్రం ఆమె స్పందించలేదు. ప్రియాంకతో పాటు శివమణి, డిజె దేవ్ జోభా కూడా ఇక్కడ పెర్పార్మ్ చేయనున్నట్లు సమాచారం.

ఇక సింగర్-రాప్పర్ యో యో హనీ సింగ్ పూణెలోని అంబే వాలీలో తన మ్యూజిక్ షో ఇచ్చేందుకు రూ. 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రముఖ సింగర్ మికా సింగ్ మనాలీలో పెర్పార్మెన్స్ ఇచ్చేందుకు రూ. 1.25 కోట్లు చార్జ్ చేసినట్లు బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.

హీరోయిన్ అమీషా పటేల్ అమ్‌స్టర్‌డామ్‌లో ఇండియన్ ఫ్యామిలీస్ నిర్వహిస్తున్న న్యూఇయర్ వేడుకలో పాల్గొంటున్నారు. ఇందుకోసం ఆమె భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రముఖ నటుడు ధర్మేంద్ర కాలిఫోర్నియాలో జరిగే న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటున్నారు. పాపులర్ ఐటం గర్ల్ రాఖీ సావంత్, ఆర్తి చాబ్రియా, చార్మి కౌర్, కశ్మీరా షా, షెఫాలి జరివాలా తదితరులు సైతం వివిధ ప్రాంతాల్లో జరిగే న్యూ ఇయర్ వేడుకల్లో తమ ఆటపాటలతో అలరించనున్నారు.

English summary
New Year's eve is just round the corner, and it's time for Bollywood celebrities and item girls to mint money! Priyanka Chopra, Amisha Patel, Rakhi Sawant, Yo Yo Honey Singh and Mika Singh are just few of the celebs who will make lot of 'moolah' this new year's eve! If reports are to be believed, Priyanka Chopra has been roped in at a whooping amount of Rs 7 crore to shake her booty for a 7 minute appearance at the Park Hyatt hotel, Chennai, to celebrate new year's eve.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu