»   » జుట్టు కట్ చేసుకోనందని హీరోయిన్ కట్

జుట్టు కట్ చేసుకోనందని హీరోయిన్ కట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"కావాలంటే విగ్‌ పెట్టుకుంటా. జుత్తు మాత్రం కత్తిరించే ప్రసక్తే లేదు' అని నిర్మొహమాటంగా చెప్పేసింది ప్రియాంక చోప్రా. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న ఈ ముద్దుగుమ్మని ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ బసు తన తాజా చిత్రం 'సైలెన్స్‌'లో హీరోయిన్ గా ఎన్నుకున్నారు. ఆమె ఇలా చెప్పటంతో ఆ ప్లేస్ లో దీపికా పడ్కోని ని తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇక స్క్రిప్టు ప్రకారం ప్రియాంక మూగ, చెవిటి అమ్మాయిగా నటించాల్సి ఉంది. నటనకు అవకాశం ఉంది కాబట్టి ఆ పాత్రను ఆనందంగా అంగీకరించారామె. ఫిజికల్లీ ఛాలెంజ్డ్‌ కాబట్టి జుత్తు కురచగా కత్తిరించుకుంటే లుక్‌ కరెక్ట్‌గా ఉంటుందని ప్రియాంకతో అనురాగ్‌ అన్నారు. అయితే ఆయన్ను షాక్‌కు గురి చేస్తూ "కావాలంటే విగ్‌ పెట్టుకుంటా. జుత్తు మాత్రం కత్తిరించే ప్రసక్తే లేదు' అని ఖచ్చితంగా చెప్పేసింది.

ఎందుకలా అంటే...'లవ్ ‌స్టోరి 2050' సినిమా కోసం జుత్తుకు రంగు వేసుకున్నప్పుడే మా ఇంట్లో నా నాన్న ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా జుత్తు కత్తిరించుకుంటే ఇంట్లోకి రానివ్వరు అని తేల్చేసింది. ప్రియాంక అభిప్రాయం విన్న తర్వాత సదరు దర్శకుడు ఆమె స్థానంలో దీపికా పదుకొనేని తీసుకోవాలని అనుకునంటున్నారు. ఈ విషయం గురించి ప్రియాంక చోప్రా దగ్గర ప్రస్తావిస్తే..."ఈ సినిమా పేరు 'సైలెన్స్‌'. ప్రస్తుతానికి ఈ చిత్రం గురించి మాట్లాడటం నాకిష్టం లేదు. అందుకే మౌనం వహించాలనుకుంటున్నాను' అంటోంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా బుల్లితెర కోసం 'కత్రోం కే కిలాడి' అనే షో చేయబోతున్నారు. అలాగే 'డాన్‌ 2' సినిమాలో నటిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu