»   » రోడ్డుపైనే మక్కెలిరగదీస్తున్న హీరోయిన్ (ఫోటోస్)

రోడ్డుపైనే మక్కెలిరగదీస్తున్న హీరోయిన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ‘గంగాజల్ 2' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. ప్రకాష్ ఝా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ భోపాల్ లో జరుగుతోంది. తాజాగా ఇక్కడి షూటింగుకు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.

పోలీస్ యూనిఫాంలో ఉన్న ప్రియాంక చోప్రా..... లాఠీ చేత పట్టి రోడ్డుపైనే నేరస్తులను ఉతికి ఆరేస్తున్న సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. యాక్షన్ అవతార్ ప్రియాంక చోప్రాకు బాగా సూటయిందని ఆమె అభిమానులు అంటున్నారు.

Priyanka Chopra's Action Scenes In Gangaajal 2

ఇంతకు ముందు ‘మేరీ కోమ్' చిత్రంలో ప్రియాంక చోప్రా.... పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టింది. ఇందులో బాక్సింగ్ క్రీడాకారిణిగా నటించిన ప్రియాంక చోప్రా విమర్శల ప్రశంసలు అందుకుంది. తాజాగా ‘గంగాజల్ 2' చిత్రంలో ఆమె ఐపీఎస్ ఆఫీసర్ అభా మాధుర్ పాత్రలో కనిపించనుంది.

Priyanka Chopra's Action Scenes In Gangaajal 2

ఇక్కడ కనిపిస్తున్న ఫోటోల్లో ప్రియాంక చెప్రా... పోలీస్ యూనిఫాంలో భోపాల్ వీధుల్లో ఓ నేరస్తుడి మక్కెలిరగదీస్తున్న దృశ్యం. ఇందులో ఆమె పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతోందని, ఆమె పెర్పార్మెన్స్ అద్భుతంగా ఉండబోతోందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

Priyanka Chopra's Action Scenes In Gangaajal 2

ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా.... గతంలో ఏ సినిమాలోనూ లేని విధంగా ఎక్కువ యాక్షన్ సీన్లలో నటించిందని, ఈ పాత్ర చేయడానికి ఆమె చాలా రోజుల నుండి ప్రిపేర్ అయిందని తెలుస్తోంది. ‘గంగాజల్' సినిమాలో అజయ్ దేవగన్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించాడు. దానికి సీక్వెల్ గా వస్తున్న ‘గంగాజల్ 2'లో ప్రియాంక చోప్రా అతనికి సమానమైన పాత్రను పోషిస్తోంది.

English summary
Priyanka Chopra will next be seen in the movie Gangaajal 2, in which the actress will be seen in the shoes of a cop.
Please Wait while comments are loading...