»   » ఇది కాపీనే... ప్రియాంకా చోప్రా హాలీవుడ్ సినిమా పై వివాదం

ఇది కాపీనే... ప్రియాంకా చోప్రా హాలీవుడ్ సినిమా పై వివాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు బాలీవుడ్ స్క్రీన్‌పైనే తమ అందాలను ఆరబోసిన ముద్దుగుమ్మలు ఇప్పుడు హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగిపోవడంతో వాళ్ల సినిమాలపై మనవాళ్లకు ఆసక్తి పెరిగింది. దీపికాపదుకొనే ట్రిఫుల్ ఎక్స్ మూవీలో నటించడం, ప్రియాంక బేవాచ్ మూవీలో యాక్ట్ చేయడంతో మరికొందరు కూడా వారిబాటలో పయనించేందుకు రెడీ అవుతున్నారు.

బేవాచ్‌

బేవాచ్‌

బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప్ర‌స్తుతం అక్క‌డ‌ ‘బేవాచ్‌' సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ప్రియాంక చోప్రా ‘బేవాచ్‌'లో విల‌న్ రోల్‌లో న‌టిస్తోంది. మ‌రోవైపు అమెరిక‌న్ సీరియ‌ల్‌ క్వాంటికో-2 సిరీస్ కోసం కూడా ప్ర‌య‌త్నిస్తోంది.

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో

అయితే కోన్ని రోజుల క్రితం ‘బేవాచ్‌' హీరో హాలీవుడ్‌ స్టార్‌ డ్వెయిన్‌ జాన్సన్ త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఖాతా ద్వారా షేర్ చేసిన సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ప్రియాంక చోప్రా క‌నిపించక‌పోవ‌డం ఆ అమ్మ‌డి అభిమానుల‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. అందుకే ఆమె అభిమానుల కోసం ఎప్పటి నుండో వినిపిస్తున్న ఈ సినిమా తాలూకు తొలి మూవీ పోస్టర్ ని ఎట్టకేలకు రిలీజ్ చేశారు.

 ప్రియాంక కనిపించలేదు

ప్రియాంక కనిపించలేదు

ఇంతకు ముందు వచ్చిన ఈ సినిమా ప్రోమో లో ప్రియాంక ఎక్కడా కనిపించలేదు. దీనితో మన దేశి అభిమానులు కొంచం నిరాశకు లోనయ్యారు. ఇప్పుడు బేవాచ్ టీం ఒక పోస్టర్ ని విడుదల చేసారు.ఆ పోస్టర్ లో ప్రియాంక ముఖం క్లోజప్ ఉండగా.. ఆమె పెట్టుకున్న మిర్రర్ ఏవియేటర్ సన్ గ్లాస్సెస్ లో ఆ మూవీ లో ఉన్న పాత్రలు కొన్ని కనిపిస్తాయి.

పోస్టర్

పోస్టర్

ఈ పోస్టర్ లో ప్రియాంక చాల సెక్సీ లుక్ తో అందరిని ఆకట్టుకుందనే చెప్పాలి. కాకపోతే అసలు విషయం ఎంటంటే ఈ సినిమా పోస్టర్ ఒక ఫేమస్ ఇంగ్లీష్ మూవీ పోస్టర్ కు మక్కికి మక్కీ దించిన కాపీలా కనిపించింది అంటూ విమర్శలు మొదలయ్యాయి. కేట్ హడ్సన్ నటించిన 'ఆల్మోస్ట్ ఫేమస్' అనే సినిమా 2000 లో వచ్చింది.

ట్ హడ్సన్ కూడా

ట్ హడ్సన్ కూడా

ఆ సినిమా పోస్టర్లో కేట్ హడ్సన్ కూడా ఏవియేటర్ సన్ గ్లాస్సెస్ పై ఆ సినిమా పేరుండి దాని నీడ లో ఆ సినిమా కు సంబంధం ఉన్న కొన్ని సన్నివేశాలు ఉంటాయీ. ఇది నిజంగేనే యాధృచ్ఛికమా లేక కాపీ నా అనీ తెలియటంలేదు. ఆల్మోస్ట్ ఫేమస్ పోస్టర్ కీ ఈ పోస్టర్ కీ మరీ ఎక్కువ పోలికలు లేకున్నా అది కాపీ నే అని వాదిస్తున్నారు ట్రోలర్స్

 తన పాత్ర క్రూరంగా ఉంటుందని

తన పాత్ర క్రూరంగా ఉంటుందని

ఇంతకు ముందు కూడా ప్రియాంకా డ్రాకులా లా కనిపించే పొస్టర్ ఒకటి రిలీజ్ చేసింది ఆ హాలీవుడ్ ఫిల్మ్ లో తన పాత్ర క్రూరంగా ఉంటుందని తెలిపింది. తానో రాక్షసినని, అమెరికా తనను అసహ్యించుకోవడం ఖాయమని చెప్తే ఎమో అనుకున్నాం గానీ కొత్తగా పోస్ట్ చేసిన ఫొటోతో తన కౄరత్వాన్ని బయట పెట్టింది ప్రియాంకా చోప్రా.

rn

ఎంట్రీ మాత్రం విలన్‌గానే

1990లో టెలివిజన్‌ సిరీస్‌గా ప్రసారమై బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించిన 'బేవాచ్‌' సిరీస్‌ ఆధారంగా అదే పేరుతో ప్రస్తుతం సినిమాని రూపొందిస్తున్నారు. కాకతాళీయంగానే అయినా ఇటు బాలీవుడ్‌లోను, అటు హాలీవుడ్‌లోనూ ప్రియాంక ఎంట్రీ మాత్రం విలన్‌గానే జరగటం విశేషం.

English summary
Priyanka Chopra's Baywatch New Poster bears striking resemblance and it be wrong to even say that it looks identical to Kate Hudson's Almost Famous poster.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu