»   » విజయశాంతి సినిమా గుర్తుకు తెస్తోంది

విజయశాంతి సినిమా గుర్తుకు తెస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న ప్రియాంక చోప్రా తాజాగా జై గంగాజల్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగ ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ప్రియాంక తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ట్రైలర్‌ను విడుదల చేసింది. 2003లో అజయ్‌ దేవగణ్‌ నటించిన గంగాజల్‌ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్‌గా వస్తోంది. ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2016 మార్చ్‌4న విడుదల కానుంది. ఈ ట్రైలర్ చూస్తూంటే తెలుగులో ఎప్పుడో వచ్చిన విజయశాంతి చిత్రం కర్తవ్యం గుర్తుకు వస్తుంది. మీరూ ఓ లుక్కేయండి మరి.

ప్రియాంక "కాశీ భాయ్" పాత్రలో నటించిన "బాజీరావ్ మస్తానీ" గత శుక్రవారం విడుదలై ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోంది.
"జై గంగాజల్" చిత్రంలో ప్రియాంక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. ప్రియాంక చోప్రా కెరీర్ లో "జై గంగాజల్" ఓ మైలురాయిగా నిలుస్తుందని ఆమె సన్నిహితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రియాంక చోప్రా కీలకపాత్రలో ప్రకాష్ ఝా తెరకెక్కిస్తున్న ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ "జై గంగాజల్" చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని మార్చ్ 4న విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నారు చిత్ర దర్శకనిర్మాతలు.

ఇందులో ప్రియాంక ప్రధాన పాత్రగా కలిసి కనిపించనుంది. క్రిస్‌మస్ కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా ఇది వరల్డ్ క్రైమ్, కరెప్షన్ నేపధ్యంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.

English summary
The trailer of Priyanka Chopra’s next, Jai Gangaajal is here and well, it is quite impressive.
Please Wait while comments are loading...